Headlines

Jabardasth Avinash: ఆ సమయంలో బాల్కనీ నుంచి దూకి చచ్చిపోవాలనిపించింది.. అంతలోనే ఒక ఫోన్ కాల్..

Jabardasth Avinash: ఆ సమయంలో బాల్కనీ నుంచి దూకి చచ్చిపోవాలనిపించింది.. అంతలోనే ఒక ఫోన్ కాల్..


Jabardasth Avinash: ఆ సమయంలో బాల్కనీ నుంచి దూకి చచ్చిపోవాలనిపించింది.. అంతలోనే ఒక ఫోన్ కాల్..

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడీ కమెడియన్. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోతో అవినాష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా మరింత పాపులర్ అయ్యాడు. రెండు సార్లు ఈ రియాలిటీ షోలో పాల్గొన్న అతను విజేతగా నిలవకున్నా తన ఆట, మాట తీరుతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీవీ షోస్, ప్రోగ్రామ్స్, ఈవెంట్స్, యాంకరింగ్ తో బిజీ ఆర్టిస్టుగా మారాడు అవినాష్. అలాగే అప్పుడప్పుడు సినిమాల్లోనూ మెరుస్తున్నాడీ స్టార్ కమెడియన్. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యుకు హాజరయ్యాడీ జబర్దస్త్ కమెడియన్. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇదే క్రమంలో జబర్దస్త్, బిగ్ బాస్ షోల గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

‘కరోనా సమయంలో హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొన్నాను. ఇంటికి ఈఎంఐలు కట్టలేక చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ సమయంలో ఆ ఇంటి బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. అంతలోనే బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది. రియాలిటీ షోలో పాల్గొనమని చెప్పారు. అది నాకు పెద్ద అవకాశం అనిపించింది. వెంటనే జబర్దస్త్ టీమ్‌ను సంప్రదించి విషయం చెప్పాను. బిగ్ బాస్ కు వెళ్లాలని ఉందని మేనేజ్మెంట్ తో చెప్పేశాను. కానీ అగ్రిమెంట్ ఉంది కాబట్టి బయటకు పోవాలంటే రూ.10 లక్షలు ఫైన్ కట్టాలని చెప్పారు. అప్పటికే నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, అప్పులు కూడా ఎక్కువగా ఉన్నాయని జబర్దస్త్ నిర్వాహకులకు చెప్పాను. కొంతైనా తగ్గిస్తారని ఆశ పడ్డాను. రెండు లక్షలు, మూడు లక్షలు అయినా అడుగుతారనుకున్నాను. కానీ పూర్తిగా రూ.10 లక్షలు కట్టాల్సిందే అన్నారు. నేను వాళ్లనేమి తప్పుపట్టడం ల ఏదు. వాళ్ల రూల్స్ ప్రకారం వాళ్లు చేశారు. కానీ ఎనిమిదేళ్లు పనిచేశాను కదా.. కాస్త దయ చూపిస్తారనుకున్నాను. కానీ అదేమీ జరగలేదు. రూ.10 లక్షల కోసం చాలా చోట్ల అప్పులు చేయాల్సి వచ్చింది. చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, శ్రీముఖి నాకు సహాయం చేశారు. ఇంకొంత స్టార్ మా నుంచి అడ్వాన్స్ తీసుకున్నాను. అలా మొత్తం రూ.10 లక్షలు కట్టి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాను. పది లక్షలు కట్టినా, బిగ్ బాస్ ద్వారా దానికంటే ఎక్కువ డబ్బే వచ్చింది. మంచి రెమ్యూనరేషన్ ఇవ్వడంతో అప్పులన్నీ క్లియర్ చేశాను’ అని చెప్పుకొచ్చాడు అవినాష్. ప్రస్తుతం ఈ జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

భార్యతో జబర్దస్త్ అవినాష్..

 

View this post on Instagram

 

A post shared by Kamlee Foundation (@kamleefoundation)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *