Hyderabad: మరోసారి చరిత్ర సృష్టించిన హౌసింగ్ బోర్డు వేలం.. గజం ఎంతో తెలుసా..!
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి వేడెక్కింది. నగరంలోని ప్రీమియం ప్రాంతాల్లో భూముల ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్వహించిన వేలం ఇందుకు నిదర్శనంగా నిలిచింది. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ (కేపీహెచ్‌బీ)లోని ఖాళీ ప్లాట్లు, ఫ్లాట్లను వేలానికి పెట్టగా ఊహించని స్థాయిలో బిడ్డింగ్ జరిగింది. ముఖ్యంగా ఒక ఓపెన్ ప్లాట్ గజం ధర ఏకంగా రూ.2.65 లక్షలకు చేరుకోవడం రియల్ ఎస్టేట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వేలానికి…