
అమ్మో కోతి.. రైతు చెవి కొరికి తీసుకుపోయిన మర్కటం
తాజాగా తెలంగాణలోని ములుగు జిల్లాలో కోతులు రెచ్చిపోయాయి. ఒంటరిగా ఉన్న ఓ వ్యక్తిపై దాడిచేసి అతని చెవిని కొరికి పట్టుకొని పోయాయి. కోతుల దాడిలో ఎడమ చెవిని కోల్పోయిన ఆ బాధితులు తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో చేరాడు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికుల్లో భయాందోళన రేకెత్తించింది. స్థానికంగా ఉండే రాజు అనే రైతు తన ఇంటి ముందు పని చేసుకుంటున్నాడు. అదే సమయంలో అటుగా ఓ కోతుల గుంపు…