
Andhra Weather: ద్రోణి ప్రభావంతో ఏపీలోని ఈ ప్రాంతాల్లో పిడుగులతో వర్షాలు
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఆదివారం కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు. ఆదివారం(21-09-25) : ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో…