చై, సమంత ‘ఏ మాయ చేశావె’కు 16ఏళ్లు..! గౌతమ్ మేనన్ మ్యాజిక్, రెహమాన్ మ్యూజిక్‌తో మర్చిపోలేని ప్రేమకథ
ఆ మేజిక్ మళ్లీ మళ్లీ జరగదు అనిపించేలా, వెండితెరపై ప్రేమకు కొత్త అర్థాన్ని అద్దింది ఆ దృశ్యకావ్యం. ఆమె నీలి రంగు చీర కట్టుకుని నడిచి వస్తుంటే.. కుర్రకారు గుండెల్లో ఏదో తెలియని అలజడి. అతను కేవలం ఒక మెకానికల్ ఇంజనీర్, కానీ ఆమె కళ్ళలోకి చూస్తూ సినిమా దర్శకుడిలా కలలు కనే ప్రేమికుడు. వారిద్దరి మధ్య కేరళ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఆ సున్నితమైన సంభాషణలు, వర్షం కురుస్తుంటే వచ్చే ఆ మ్యూజిక్ నేటికీ మన…