Telangana: వచ్చే ఏడాది నుంచే కొత్త స్కూల్స్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ అకునూరి మురళి నేతృత్వంలోని బృందం తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ 2026 విజన్ ఫర్ ఇంక్లూజివ్ ఎక్సలెన్స్ పేరుతో రూపొందించిన సమగ్ర నివేదికను సమర్పించింది. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వరరావు, డాక్టర్ చారకొండ వెంకటేష్, జ్యోత్స్న శివారెడ్డి పాల్గొన్నారు. కీలక ప్రతిపాదనలు ఇవే: 2,000 పాఠశాలల ఆధునీకరణ: రాష్ట్రంలోని 2,000 పాఠశాలలను ప్రయోగశాలలు, లైబ్రరీలు, క్రీడా సౌకర్యాలతో కూడిన సమగ్ర…