Headlines

Athadu Movie: అతడు సినిమాలో త్రిష అక్కగా నటించిన హారిక గుర్తున్నారా ? ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..


టాలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన క్లాసిక్ చిత్రాలలో సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’ ఒకటి. 2005లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ టీవీల్లో వస్తే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుంటారు. ఈ చిత్రంలో ప్రతి ఒక్క పాత్రకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ త్రిష (పూరి) కుటుంబ సభ్యుల మధ్య వచ్చే హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ‘అతడు’ సినిమాలో త్రిష అక్క ‘లలిత’ పాత్రలో నటించిన నటి హారిక ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది. పెళ్లి చూపుల సన్నివేశంలో, వర్షంలో వచ్చే పాటలో, కుటుంబ సభ్యుల గందరగోళ సన్నివేశాల్లో ఆమె తన అమాయకత్వంతో కూడిన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ ఒక్క సినిమాతోనే హారిక తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు.

ఎక్కువ మంది చదివినవి : Roja: ఆ హీరో అంటే చాలా ఇష్టం.. ఆయనతో చాలా సినిమాలు చేశా.. హీరోయిన్ రోజా..

గతంలో ‘రాజాబాబు’, ‘అందగాడు’, ‘ఎవడి గోల వాడిదే’ వంటి పలు చిత్రాల్లో నటించినప్పటికీ, ‘అతడు’ ఆడిషన్స్‌కి వెళ్లినప్పుడు త్రిషకు అక్క పాత్ర అని చెప్పగానే హారిక మొదట అంతగా ఆసక్తి చూపించలేదట. అయితే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆమెను మళ్లీ పిలిచి, ఆ పాత్ర కథలో ఎంత ముఖ్యమైనదో వివరించి ఒప్పించారు. ఆ నమ్మకమే హారిక కెరీర్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన పాత్రగా నిలిచింది. ఇప్పటికీ జనాలు ఆమెను చూస్తే ‘అతడు’ సినిమాలో త్రిష అక్క కదా అని అడుగుతుంటారని హారిక ఆనందం వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: నిజమైన కథతో వచ్చిన 8 ఎపిసోడ్స్ సిరీస్.. 60 దేశాలలో నంబర్ వన్.. ఒక్కసారి చూస్తే అస్సలు వదలరు..

‘అతడు’ సినిమా వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తున్నా, హారిక గ్లామర్‌లో ఇప్పటికీ చెక్కుచెదరలేదు. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అప్పట్లో హోమ్లీగా, సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఈ నటి, ఇప్పుడు చాలా స్టైలిష్‌గా, గ్లామరస్‌గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు “అతడు లలిత ఇంతలా మారిపోయారా?” అంటూ కామెంట్లు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం.. ఆమె నుదుటన సూది మొనంత ప్రేమ రాయలేదు ఆ దేవుడు..

హరిక..

Harika

Harika

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంది రా బాబూ పాట.. 2 రోజులుగా యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్.. డీజేలో మోత మోగిపోద్ది..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *