Headlines

విజయవాడ స్టైల్ చిట్టి పునుగులు తినాలనిపిస్తే.. అప్పటికప్పుడు ఇలా చేయండి! భలే ఉంటాయి


రెండు నోరూరించే వంటకాల తయారీ విధానాన్ని ఇక్కడ తెలుసుకుందాం.. ఒకటి అప్పటికప్పుడు చేసుకోదగిన విజయవాడ స్టైల్ చిట్టి పునుగులు, వాటికి సరిపోయే స్పెషల్ చట్నీ. ఎటువంటి పప్పులు నానబెట్టే అవసరం లేకుండా, ఇడ్లీ లేదా దోశ పిండితో పని లేకుండా ఈ చిట్టి పునుగులను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.

పునుగుల చట్నీ తయారీ

ముందుగా ఒక పాన్‌లో రెండు స్పూన్ల నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి, మీడియం సైజు ముక్కలుగా కోసిన మూడు టమాటోలు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటోలు సాఫ్ట్‌గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో నాలుగు వెల్లుల్లి రెక్కలు, రెండు అంగుళాల అల్లం, రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. దీనికి మగ్గించిన టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కలిపి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చివరిగా కొన్ని తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక్కసారి గ్రైండ్ చేస్తే పునుగుల్లోకి అద్దిరిపోయే చట్నీ సిద్ధం.

చిట్టి పునుగులు తయారీ

మూడు బంగాళదుంపలను ఉడికించి పొట్టు తీసి మిక్సీ జార్‌లో కట్ చేసి వేసి, నీళ్లు కలపకుండా మెత్తని పేస్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ఒక బౌల్‌లోకి తీసుకుని, ఒక కప్పు పొడి బియ్యం పిండి, ఒక కప్పు గోధుమపిండి (లేదా మైదా) వేసుకోవాలి. దీనికి తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, రుచికి తగ్గ ఉప్పు, అర స్పూన్ జీలకర్ర వేసి అంతా బాగా కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లు కలుపుకుంటూ మరీ పల్చగా లేదా మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా పిండిని కలుపుకోవాలి. చివరిగా పావు స్పూన్ సోడా ఉప్పు (బేకింగ్ సోడా) వేసి పిండిలో బాగా కలిసేలా చూసుకోవాలి. ఇది పునుగులు పొంగడానికి, గుల్లగా రావడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి



డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసి, నూనె బాగా వేడయ్యాక సిద్ధం చేసుకున్న పిండిని చిట్టి చిట్టి పునుగుల్లాగా వేసుకోండి. మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజువైనా వేయొచ్చు కానీ చిట్టి చిట్టి పునుగులు అయితే బాగుంటాయి. ఈ వేసుకున్న పునుగులు అన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే చక్కగా అంతా ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి. స్టవ్ ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు పైన క్రిస్పీగా ఫ్రై అవుతాయి లోపల సాఫ్ట్ గా ఉంటాయి గుల్లగుల్లగా.. చక్కగా.. పునుగులు అయితే ఫ్రై చేసుకోవాలి. మీరు కొంచెం డార్క్ కలర్ కావాలంటే కొంచెం డార్క్ కలర్ అయిన తర్వాత తీసుకోవచ్చు. లేదు కొంచెం లైట్ గోల్డ్ ఎల్లోయిష్ కలర్లో ఉంటే బాగుంటుంది అనుకుంటే ఇంకొక మూడు నాలుగు సెకండ్లు ముందే ఆయిల్‌ లో నుంచి తీసుకోవాలి. అంతే వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రుచి భలే ఉంటుంది. ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీతో ఈ పునుగులు రుచి చూడొచ్చు..

ఈ చిట్టి పునుగులు.. అప్పటికప్పుడు అన్నీ ఇంట్లో ఉన్న వాటితో చేసేయొచ్చు. ఎలాంటి దోశ పిండి, ఇడ్లీ పిండి అక్కర్లేదు పప్పులు, బియ్యం నానబెట్టి రుబ్బే పని లేకుండా ఈజీగా అయిపోతుంది. విజయవాడ సైడ్ చిట్టి పునుగులు ఎప్పుడైనా తిన్నారా? తింటే మాత్రం ఆ టేస్ట్‌ని మరిపించేలా ఈ చిట్టి పునుగులు ఉంటాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *