Headlines

Special Trains: పండక్కి ఊరెళ్లవారికి గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లలో స్పెషల్ ట్రైన్స్ ప్రకటించిన రైల్వేశాఖ!


Special Trains: పండక్కి ఊరెళ్లవారికి గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లలో స్పెషల్ ట్రైన్స్ ప్రకటించిన రైల్వేశాఖ!

తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశ వ్యాప్తంగా జరుపుకునే పెద్ద పండుగలు దసరా, దీపావళి.. ఈ పండుగలు వచ్చాయంటే చాలు.. జాబ్‌ల కోసమని వివిధ నగరాల్లో నివసిస్తున్న వారు సొంతూళ్లకు బయల్దేరుతారు. దీంతో పండుగ సమయాల్లో ట్రైన్, బస్సు ఇలా అన్నింట్లో రద్దీ పెరుగుతుంది. ఈ రద్దీ దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక సేవలను అందిస్తుంటుంది. తాజాగా పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కూడా పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు వివిధ ప్రాంతాల మధ్య నడిచే ఈ వారాంతపు స్పెషల్ ట్రైన్ల వివరాలను తాజాగా విడుదల చేసింది.

పండుగకు నడిచే ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవే:

నాందేడ్ – నిజాముద్దీన్ – నాందేడ్ ప్రత్యేక రైళ్లు

నాందేడ్ – హజ్రత్ నిజాముద్దీన్‌ రూట్‌లో 07621 నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఈ ట్రైన్ అక్టోబర్ 17 నుంచి నవంబర్ 28 వరకు ప్రతి శనివారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. అలాగే హజ్రత్ నిజాముద్దీన్ – నాందేడ్ మధ్య రాకపోకలు సాగించే 07622 నెంబర్ గల రైలు అక్టోబర్ 18 నుంచి నవంబర్ 29 వరకు ప్రతి ఆదివారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

ఈ రెండు నగరాల మధ్య రాకపోకలు సాగించే నాందేడ్ ఎక్స్‌ప్రెస్.. పూర్ణ, పర్బణి, సెలూ, పర్తూర్, జాల్నా, ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్), మన్మాడ్, జలగావ్, భుసావల్, ఖాండ్వా, ఇటార్సీ, భోపాల్, బినా, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా కంటోన్మెంట్, మధుర స్టేషన్లలో ఆగుతుంది. ఈ ట్రైన్‌లో 1AC, 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

జాల్నా – ఛప్రా – జాల్నా ప్రత్యేక రైళ్లు

మరో స్పెషల్ ట్రైన్ జాల్నా ట్రైన్.. 07651 నెంబర్ గల ఈ ట్రైన్ జాల్నా – ఛప్రా మధ్య రాకపోకలు సాగిస్తోంది. ఈ ట్రైన్ అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 28 వరకు ప్రతి బుధవారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఇక రిటర్న్ సేవలు అందించే 07652 నెంబర్ గల మరో స్పెషల్ ట్రైన్ అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 30 వరకు ప్రతి శుక్రవారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

ఇక ఈ నగరాల మధ్య రాకపోకలు సాగించే స్పెషల్ ట్రైన్.. ఛత్రపతి శంభాజీనగర్, నాగర్‌సోల్, మన్మాడ్, భుసావల్, ఖాండ్వా, హర్దా, ఇటార్సీ, పిపారియా, గడర్వారా, నర్సింగ్‌పూర్, జబల్‌పూర్, కట్నీ, మైహర్, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ ఛియోకి, వింధ్యాచల్, వారణాసి, ఔన్రిహార్, ఘాజీపూర్ సిటీ, బల్లియా స్టేషన్‌లలో ఆగుతుంది. ఈ ట్రైన్‌లో 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

నాందేడ్ – ఉధ్నా – నాందేడ్ ప్రత్యేక రైళ్లు

07605 నెంబర్ గల మరో స్పెషల్ ట్రైన్ నాందేడ్ – ఉధ్నా మధ్య రాకపోకలు సాగిస్తోంది. ఈ ట్రైన్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 23 వరకు ప్రతి సోమవారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. అలాగే 07606 నెంబర్ గల రిటర్న్ ట్రైన్ అక్టోబర్ 6 నుంచి నవంబర్ 24 వరకు ప్రతి మంగళవారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

ఈ రెండు మార్గాల మధ్య రాకపోకలు సాగించే స్పెషల్ ట్రైన్.. పూర్ణ, బాస్మత్, హింగోలి, వాషిమ్, అకోలా, షెగావ్ (కేవలం 07606 రైలుకు మాత్రమే), మల్కాపూర్, భుసావల్, జలగావ్, ధరణ్‌గావ్, అమల్నేర్, నందూర్బార్, వ్యారా స్టేషన్లలో ఆగుతుంది. ఈ ట్రైన్‌లో 1AC, 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. కాబట్టి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల సదుపాయాన్ని వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *