Headlines

AP EAPCET 2026 Exams: ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు మొదలయ్యాయ్.. ఫలితాలు విడుదల తేదీ ఇదే

AP EAPCET 2026 Exams: ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు మొదలయ్యాయ్.. ఫలితాలు విడుదల తేదీ ఇదే


అమరావతి, మే 12: రాష్ట్ర వ్యాప్తంగా జేఎన్‌టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఈఏపీసెట్‌ 2026) ఆన్‌లైన్‌ రాత పరీక్షలు మంగళవారం (మే 12) నుంచి ప్రారంభమైనాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,55,008 మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ఇంజనీరింగ్‌కు 2,75,794 మంది, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీకి 78,421 మంది, రెండింటికీ 792 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. రోజుకు రెండు షిఫ్టుల్లో జరిగే ఈ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని సెట్‌ కన్వీనర్‌ ఎన్‌ మోహనరావు పేర్కొన్నారు. విద్యార్థులు తమకు కేటాయించిన కేంద్రంలోకి గంట ముందుగానే చేరుకుని తమకు కేటాయించిన కంప్యూటర్‌ సరిగా పనిచేస్తుందో లేదో సరిచూసుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో మొత్తం 142 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. మే12 నుంచి 15వ, 18వ తేదీ వరకూ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన పరీక్షలు జరుగుతాయి. ఆ తర్వాత మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు చెందిన పరీక్షలు జరగనున్నాయి. రెండు స్ట్రీమ్‌ల పరీక్షలు మొత్తం 14 సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది JNTU కాకినాడ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఏపీఈఏపీసెట్‌ పరీక్షకు సంబంధించిన సందేహాలు నివృత్తి చేసుకోవడానికి 0884 2359599, 2342499 నెంబర్లను సంప్రదించాలని కన్వీనర్‌ సూచించారు. పరీక్షలు పూర్తయిన తర్వాత మే 23న ఆన్సర్‌ కీ విడుదల చేసి, జూన్‌ 1వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు.

తెలంగాణ ఈఏపీసెట్‌ 2026 ఆన్సర్‌ కీ విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌

తెలంగాణ ఈఏపీసెట్‌ 2026 ప్రాథమిక కీతో పాటు రెస్పాన్స్ షీట్, మాస్టర్ ప్రశ్నపత్రాలను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అభ్యర్ధులు ఈ కింది డైరెక్ట్‌ లింక్‌ ద్వారా వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈఏపీసెట్‌ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం పరీక్షలు మే 4, 5 తేదీలలో జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించిన రెస్పాన్స్ షీట్, మాస్టర్ ప్రశ్నపత్రం, ప్రాథమిక కీని మే 13 ఉదయం 11.30 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే అభ్యంతరాలను కూడా మే 13 వరకు తెలుపవచ్చు. ఇంజినీరింగ్ విభాగం పరీక్షలకు మే 9 నుంచి 11 వరకు జరిగాయి. ఈ పరీక్షల రెస్పాన్స్ షీట్, మాస్టర్ ప్రశ్నపత్రం, ప్రాథమిక కీని మే 12 నుంచి 14 వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యంతరాలను మే 14 ఉదయం 11 గంటల వరకు సమర్పించవచ్చు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఈఏపీసెట్‌ 2026 ఆన్సర్‌ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *