Headlines

AIBE 22 Admit Card 2026: బార్ కౌన్సిల్ అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్‌.. ఎగ్జాం ఎప్పుడంటే?


హైదరాబాద్‌, అక్టోబర్ 15: న్యాయవాద వృత్తిలో కొనసాగాలనుకునే అభ్యర్థులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (AIBE) 22 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

AIBE 22 హాల్‌టికెట్ డౌన్‌లోడ్ విధానం

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ allindiabarexamination.com ను సందర్శించాలి.
  • హోమ్‌పేజీలో కనిపించే ‘Login’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • అనంతరం తమ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ నమోదు చేయాలి.
  • స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.
  • లాగిన్ అయిన తర్వాత AIBE 22 Admit Card లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.

అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే అందులోని వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ముఖ్యంగా అభ్యర్థి పేరు, రోల్ నంబర్, పరీక్షా కేంద్రం చిరునామా, కేటగిరీ, పరీక్ష సమయం, ఫొటో, సంతకం వంటి వివరాలను సరిచూసుకోవాలి. ఏవైనా తప్పులు లేదా పొరపాట్లు కనిపిస్తే పరీక్ష తేదీకి ముందుగానే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులను సంప్రదించి సరిచేయించుకోవాలి. AIBE 22 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డు ప్రింటెడ్ కాపీని తప్పనిసరిగా తమ వెంట తీసుకెళ్లాలి. హాల్‌టికెట్ లేకుండా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. అందువల్ల చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది. పరీక్షకు సంబంధించిన తాజా మార్గదర్శకాలు, నిబంధనలు, పరీక్షా కేంద్ర వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలి.

ఇవి కూడా చదవండి



ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 2026 హాల్‌ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *