Headlines

Hyderabad Fish Markets: బీ అలర్ట్! హైదరాబాద్‌లోని చేపల మార్కెట్లలో కుళ్లిన చేపల అమ్మకం


హైదరాబాద్‌లోని బేగంబజార్, రామ్‌నగర్ చేపల మార్కెట్లలో టీజీ సేఫ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి షాకింగ్ నిజాలను వెల్లడించారు. కొందరు వ్యాపారులు లాభాల కోసం అత్యాశతో నెలల తరబడి ఐస్‌లో నిల్వ ఉంచిన కుళ్ళిన చేపలను తాజావిగా నమ్మించి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడులలో సుమారు 858 కిలోల కుళ్ళిన చేపలు, రొయ్యలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అధికారులు చేపట్టిన తనిఖీలలో పలు దుకాణాలలో పరిశుభ్రత లోపించిందని, అపరిశుభ్ర వాతావరణంలో చేపలను నిల్వ ఉంచుతున్నారని తేలింది. చాలా మంది వ్యాపారుల వద్ద ట్రేడ్ లైసెన్సులు మాత్రమే ఉండగా, FSSAI ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు లేకపోవడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా కుళ్ళిన చేపలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని టీజీ సేఫ్ అధికారులు హెచ్చరించారు. తాజా చేపల మొప్పలు ఎర్రగా, కళ్ళు స్పష్టంగా ఉంటాయని, కుళ్ళిన చేపలు మెత్తగా మారి దుర్వాసన వస్తాయని టీజీ సేఫ్ డిప్యూటీ కంట్రోలర్ ఆనందరావు వివరించారు. ప్రజలు చేపలను కొనేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Shah Rukh Khan: అనంత్ అంబానీ వీడియోపై షారుఖ్ సీరియస్ ఇన్‌ఫ్లూయెన్సర్‌కు లీగల్ నోటీస్

9 ఏళ్ల నిరీక్షణకు తెర.. నంది అవార్డుల పునరుద్ధరణ

Samantha: డెలివరీ వేళ సమంత ఫ్యామిలీలో టెన్షన్ ! అసలు కారణం ఇదే!

Vrushakarma Trailer: 5 వేల ఏళ్ల నాటి రహస్యం.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వృషకర్మ ట్రైలర్

Kaithi: కార్తి రిక్వెస్ట్ చేయడంతో.. హిట్టు సినిమా వదులుకున్న సేతుపతి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *