Headlines

బ్యాటింగ్ వైఫల్యాలపై గంభీర్, రవిశాస్త్రి సీరియస్!


న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను టీమిండియా 3-1 తేడాతో ఘనంగా కైవసం చేసుకుంది. సిరీస్ విజయం సాధించినప్పటికీ భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యాలు క్రికెట్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. చివరి మ్యాచ్‌లో 209 పరుగుల స్వల్ప స్కోరును కాపాడుకుని 22 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.అయితే ఈ సిరీస్‌లో భారత బ్యాటింగ్ ప్రదర్శన మాత్రం ఎక్కడా ఆశించిన స్థాయిలో సాగలేదు. ముఖ్యంగా నాలుగో వన్డేలో కేవలం 89 పరుగులకే జట్టు కుప్పకూలడం తీవ్ర చర్చనీయాంశమైంది. నాలుగో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు భారీగా 333 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ కేవలం 26.4 ఓవర్లలోనే 89 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్ మాట్ హెన్రీ ఆరు వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను పూర్తిగా దెబ్బతీశాడు. అంతకుముందు రెండో వన్డేలోనూ 135 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ తడబడింది. ఆ మ్యాచ్‌లో కేవలం 111 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. వరుసగా ఇలాంటి బలహీనతలు బయటపడుతుండటంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడలేని బంతులు ఉండవని, బౌలర్లు మంచి లైన్ అండ్ లెంత్ బంతులు వేసినప్పుడు వాటిని ఎదుర్కొనే నైపుణ్యం బ్యాటర్లకు ఉండాలని గంభీర్ స్పష్టం చేశారు. గంభీర్ ఆందోళనతో పూర్తిగా మాజీ కోచ్ రవిశాస్త్రి ఏకీభవించారు. ప్రపంచకప్‌లో ఎదురయ్యే సవాల్‌తో కూడిన పిచ్‌లపై భారత బ్యాటర్లు మరింత మెరుగ్గా రాణించాలని ఆయన సూచించారు. ప్రతి మ్యాచ్‌లోనూ 300 నుంచి 320 పరుగులు చేయాలనే ఆలోచనను పక్కన పెట్టాలని శాస్త్రి హితవు పలికారు. బౌలర్లకు సహకరించే పిచ్‌లపై 260 పరుగులు చేసినా గెలిచే అవకాశం ఉంటుందని, బ్యాటర్లు ఓపికగా ఆడాలని స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయ్యో.. పచ్చబొట్టు ఎంత పనిచేసింది!

Upasana: నాన్న.. పిల్లల డైపర్ మారిస్తే పెద్ద గొప్పేం కాదు’ పిల్లల పెంపకంపై ఉపాసన కామెంట్స్

Rohith Naidu: హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వడంపై.. రోహిత్ నాయుడు నుంచి కీలక నోట్!

Ramayana: సీత యోధురాలే.. నా రామాయణ నిజమే! సాక్ష్యాలతో విమర్శకుల నోళ్లు మూయించిన డైరెక్టర్

సినిమా కోసం.. అమెరికాలో IT జాబ్‌కి రిజైన్‌! ఇంట్రెస్టింగ్‌గా సాత్విక స్టోరీ!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *