World Cup 2027: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2027 వన్డే వరల్డ్ కప్‌కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీ షెడ్యూల్‌ను అక్టోబర్ 1న ప్రకటించేందుకు ఐసీసీ సిద్ధమైంది. అదే రోజు ప్రపంచకప్ టికెట్ల కోసం బ్యాలెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. 2027 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌ను అక్టోబర్ 1న కేప్‌టౌన్‌లో ఐసీసీ అధికారికంగా వెల్లడించనుంది. అయితే అభిమానులు అదే రోజు టికెట్లు నేరుగా కొనుగోలు చేయలేరు. ముందుగా టికెట్ బ్యాలెట్ కోసం తమ వివరాలను రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది.
అక్టోబర్-నవంబర్‌లో క్రికెట్ పండుగ
2027 ప్రపంచకప్ అక్టోబర్, నవంబర్ నెలల్లో సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరగనుంది. ఆఫ్రికా ఖండంలో దాదాపు 24 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ నిర్వహించనున్నారు. మూడు దేశాల్లోని 12 నగరాల్లో మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
14 జట్లతో కొత్త ఫార్మాట్
ఈసారి ప్రపంచకప్‌లో మొత్తం 14 జట్లు పాల్గొంటాయి. 10 జట్ల నుంచి టోర్నీని 14 జట్లకు పెంచడంతో ఫార్మాట్‌లో కూడా ఐసీసీ మార్పులు చేసింది. తొలి దశలో మూడు అత్యల్ప ర్యాంక్ జట్లు సూపర్ సిరీస్‌లో తలపడతాయి. అందులో టాప్‌లో నిలిచిన జట్టు తదుపరి దశకు వెళ్తుంది. ఆ తర్వాత 12 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి పోటీ పడతాయి. అక్కడి నుంచి అర్హత సాధించిన జట్లు సూపర్ 7 దశలో తలపడతాయి. సూపర్ 7లో టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి. సెమీఫైనల్స్‌లో విజేతలుగా నిలిచిన రెండు జట్లు ఫైనల్లో టైటిల్ కోసం పోరాడతాయి.
భారత్ సహా టాప్ జట్లపై ఆసక్తి
ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ వంటి జట్ల అర్హత సమీకరణాలపై కూడా ఆసక్తి నెలకొంది. మరోవైపు మాజీ ఛాంపియన్ వెస్టిండీస్ జట్టు కూడా ప్రపంచకప్‌లో చోటు కోసం పోరాడాల్సి ఉంది.
అభిమానుల్లో భారీ అంచనాలు
ఆఫ్రికా గడ్డపై జరగనున్న ఈ ప్రపంచకప్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కొత్త ఫార్మాట్‌తో పాటు 14 జట్లు బరిలో ఉండటంతో టోర్నీ మరింత ఆసక్తికరంగా మారనుంది. అక్టోబర్ 1న షెడ్యూల్ విడుదలైన తర్వాత ఏ జట్టు ఎవరితో, ఎక్కడ తలపడనుందనే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..