Headlines

Tollywood : తిరుమల బ్రహ్మోత్సవాల్లో టాలీవుడ్ హీరోయిన్.. కూచిపూడి నాట్యంతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ..


టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి కూచిపూడి నృత్యంతో ఆకట్టుకున్నారు. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆమె ప్రదర్శన ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఆ వీడియోలో డింపుల్ వివిధ నాట్య భంగిమలు, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలరించారు. కాగా డింపుల్ నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇన్నాళ్లు సినిమాలు, యాక్టింగ్, గ్లామరస్ నటనతో మెప్పించిన డింపుల్ లో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎంతో అందంగా, చూడటానికి కనుల విందుగా నాట్యంతో ఆకట్టుకున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె త్రివిక్రమ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆదర్శ కుటుంబం’లో నటించారు. ఈ మూవీ అక్టోబర్ 9న రిలీజ్ కానుంది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..

సౌత్ ఇండస్ట్రీలో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది డింపుల్ హయాతి. తెలుగుతోపాటు తమిళంలనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ చిత్రంలో జర్రా జర్రా అనే స్పెషల్ పాటతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఆత్రంగి రే, వీరమే వాగై సూడుమ్, ఖిలాడి, రామబాణం, భర్త మహాశయులకు విజ్ఞప్తి వంటి చిత్రాల్లో నటించింది.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

డింపుల్ హయాతి కూచిపూడి నాట్యం..

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *