Headlines

అయ్యో దేవుడా..! వేడి సాంబార్‌లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!


విజయవాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ప్రమాదవశాత్తూ వేడి సాంబార్‌లో పడి తీవ్రంగా గాయపడిన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. విజయవాడ చిట్టినగర్‌కు చెందిన సుజాత ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సెప్టెంబర్ 20వ తేదీ ఆదివారం రోజున వినాయక చవితి సందర్భంగా స్థానికంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుజాత వంట పనుల్లో పాల్గొన్నారు. అన్నదానానికి సిద్ధం చేసిన సాంబార్ గిన్నెను దించే సమయంలో ప్రమాదవశాత్తూ ఆమె అదుపుతప్పి వేడిగా ఉన్న సాంబార్‌లో పడిపోయారు. ఈ ఘటనలో సుజాతకు తీవ్ర గాయాలు కాగా.. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో సుజాత మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మరోవైపు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సాంబార్ గిన్నెను దించే సమయంలో ప్రమాదం జరిగిన దృశ్యాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియో స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం ఎలా జరిగింది? కార్యక్రమం నిర్వహణలో ఏమైనా నిర్లక్ష్యం జరిగిందా? అనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరా దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

వినాయక చవితి సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమంలో ఊహించని ప్రమాదం చోటుచేసుకోవడం, చికిత్స పొందుతూ సుజాత మృతి చెందడంతో చిట్టినగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *