Headlines

Tollywood : పక్కింట్లో మిగిలిన అన్నం పెడతారేమో అని ఎదురుచూసేదాన్ని.. జబర్దస్త్ నటి ఎమోషనల్ కామెంట్స్..


జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు గురించి చెప్పక్కర్లేదు. సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో ద్వారా మరింత పాపులర్ అయిన ఈ అమ్మడు ఇటీవల తన జీవితంలోని కఠినమైన వాస్తవాలను, ఎదుర్కొన్న కష్టాలను ఆవేదనగా పంచుకున్నారు. కుటుంబ మద్దతు, ఆర్థిక సహాయం లేదా ఇండస్ట్రీ నేపథ్యం లేకుండా ఒక అబ్బాయికి కూడా సమాజంలో నిలదొక్కుకోవడం కష్టమని, అలాంటిది ఒక అమ్మాయిగా తాను పడిన కష్టాలు వర్ణనాతీతమని ఆమె అన్నారు. బయటి ప్రపంచానికి వచ్చి తనను తాను నిరూపించుకోవాలన్నప్పుడు ఎన్నో చెప్పలేనంతటి కష్టాలు ఎదురయ్యాయని, వాటిని తానొక్కదానే భరించానని తెలిపారు. తన చిన్ననాటి నుండే కష్టపడటం అలవాటైందని సౌమ్య రావు చెప్పారు. ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడే ట్యూషన్స్ చెప్పి నెలకు రూ. 400 సంపాదించేదానినని, అందులో రూ. 200 ఇంటి అద్దెకు చెల్లించేదానినని గుర్తు చేసుకున్నారు. కాలేజీ చదువుకునే రోజుల్లో కూడా పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూనే చదువుకున్నానని, ఒక లాయర్ దగ్గర అసిస్టెంట్ గా, టైపిస్ట్ గా పనిచేశానని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..

ఆనాటి పేదరికం గురించి మాట్లాడుతూ, కొన్నిసార్లు పక్కింటి వారు అన్నం పెడతారేమోనని 11, 11:30 గంటల వరకు కూడా అన్నం కోసం ఎదురుచూసిన రోజులున్నాయని చెప్పి అందరినీ కదిలించారు. కష్టాలు, పేదరికం అంటే ఏమిటో తనకు చాలా బాగా తెలుసని సౌమ్య రావు భావోద్వేగానికి లోనయ్యారు. ఇండస్ట్రీలోకి రావడం అంత సులువు కాదని సౌమ్య రావు స్పష్టం చేశారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన తనకు ఎవరూ రెడ్ కార్పెట్ పరిచి హీరోయిన్ పాత్రలు ఇవ్వలేదని, చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చానని అన్నారు. చిన్న ఛానెల్లో న్యూస్ రీడర్ గా, ఆ తర్వాత యాంకర్ గా, మెల్లమెల్లగా పెద్ద ఛానెళ్లకు వెళ్లి, తమిళ ఇండస్ట్రీలో సీరియల్స్ లో క్యారెక్టర్లు, సెకండ్ లీడ్, ఆపై మొదటి హీరోయిన్ స్థాయికి ఎదిగానని ఆమె వివరించారు.

కొంతమంది తక్కువ సమయంలోనే పెద్ద పెద్ద ఆఫర్స్ తో, బెంజ్, ఆడి కార్లతో, రెండు మూడు ఫ్లాట్స్ తో ఇండస్ట్రీలోకి వస్తుంటారని, వారు ఎలా సంపాదిస్తారో తనకు తెలియదని సౌమ్య రావు అన్నారు. అలాంటి షార్ట్ కట్ మార్గాలను తాను ఎంచుకోలేదని, క్యారెక్టర్, నిజాయితీ, కష్టపడే తత్వంతోనే ముందుకు వెళ్లాలని ఆమె గట్టిగా నమ్ముతానని చెప్పారు. అలాంటి వారితో తాను కలవబోనని, అలాంటి షార్ట్ కట్ దారులు తనకు వద్దని ఆమె తేల్చి చెప్పారు. ఈ రంగంలో నిజాయితీగా, క్వాలిటీతో నిలదొక్కుకోవడం చాలా కష్టమని, అయినప్పటికీ తను మాత్రం అదే మార్గాన్ని ఎంచుకున్నానని సౌమ్య రావు స్పష్టం చేశారు. ప్రస్తుతం తన జీవితంలో మంచి రోజులు చూస్తున్నానని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

సౌమ్య రావు..

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *