Headlines

ఆదిలాబాద్ రిమ్స్‌‌లో ఘోరం.. ఏసీ పేలి ఇద్దరు శిశువుల మృతి..


ఆదిలాబాద్‌ రిమ్స్‌లో అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఏసీ యూనిట్ పేలడంతో.. కనీసం నెల కూడా నిండని చిన్నారులు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. ముక్కుపచ్చలారని చిన్నారులు పుట్టిన కొన్ని రోజుల్లోనే చనిపోవడంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. రిమ్స్‌లోని స్పెషల్ కేర్ నియోనాటల్ యూనిట్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో ఏసీ పేలింది. ఈ ప్రమాదంలో ఓ నవజాత శిశువు స్పాట్‌లోనే చనిపోగా, మరొక చిన్నారి ప్రైవేట్ ఆస్పత్రికి తలిస్తుండగా చనిపోయినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో NICU వార్డులో 27మంది చిన్నారులున్నారు. పలువురు చిన్నారులకు గాయాలు కాగా, మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. గాయపడిన చిన్నారులకు 4 ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

నియోనాటల్ యూనిట్‌లో అప్పుడే పుట్టిన చిన్నారులు మాత్రమే ఉంటారు. కామెర్లు, శ్వాస కోస ఇబ్బందులు, నెలలు నిండక ముందే పుట్టిన నవజాత శిశువులకు ఈ నియోనాటల్ యూనిట్‌లో చికిత్స అందిస్తారు. ఏసీ పేలడంతో NICU వార్డ్ మొత్తం దట్టంగా పొగ అలుముకుంది. దాంతో.. డోర్ అద్దాలు పగలగొట్టి చిన్నారులను రక్షించారు. పొగను పీల్చడంతో.. ఇద్దరు చిన్నారులు కండిషన్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదం తర్వాత అక్కడున్న రోగులు, వారి బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఆసుపత్రి నుంచి బయటకు చిన్నారులను తీసుకుని పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యామంటున్నారు తల్లులు.

ప్రమాద సమయంలో NICU నుంచి బయటకు తీసుకొచ్చిన ఐదుగురు చిన్నారులకు గణేష్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఆదిలాబాద్ రిమ్స్ లో చిన్నారుల మృతిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం.. కాగా, ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.

వీడియో చూడండి..



మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *