Headlines

Dragon: డ్రాగన్ సెట్స్‌లోకి NTR రీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్


గాయం కారణంగా గత కొన్ని నెలలుగా పూర్తి విశ్రాంతి తీసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఎట్టకేలకు డ్రాగన్ సెట్స్‌లో మళ్ళీ అడుగుపెట్టబోతున్నారా..? తారక్ లేక డిస్టర్బ్ అయిన షెడ్యూల్స్ అన్నింటినీ కవర్ చేయడానికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ చేశారా..? అసలు లూగర్ లొకేషన్‌కు వచ్చేదెప్పుడు.. రిలీజ్ డేట్‌లో మార్పులేమైనా ఉన్నాయా..? గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే కెమెరా ముందుకు రానున్నారు. అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి డ్రాగన్ సెట్స్‌లోకి అడుగు పెట్టనున్నారు. తారక్ రెస్ట్ కారణంగా ఇప్పటికే షెడ్యూల్స్ చాలా వరకు డిస్టర్బ్ అయ్యాయి. దాంతో ఇకపై బ్రేక్స్ లేకుండా ప్రశాంత్ నీల్ పక్కా ప్లానింగ్‌తో బ్యాక్ టు బ్యాక్ షూట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇన్ని రోజులు షూట్ ఆగినా.. ఎలాంటి డిలేస్ లేకుండా ముందుగా అనుకున్న టార్గెట్ ప్రకారం జూన్ 11, 2027నే సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. డ్రాగన్‌లో తారక్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అనిల్ కపూర్, బిజు మీనన్, ఖుష్బు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, ఆలియా భట్ కూడా ఇందులో భాగం కానున్నారని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్‌తో ఇంటర్నేషనల్ మాఫియా నేపథ్యంలో డ్రాగన్ తెరకెక్కుతుంది. ఇన్నాళ్లూ ఎన్టీఆర్ లేకపోయినా.. ఆయన లేని సన్నివేశాలు షూట్ చేసారు నీల్. తారక్ వచ్చాక అక్టోబర్ నుంచి నాన్‌ స్టాప్‌గా షెడ్యూల్స్ జరగనున్నాయి. మొత్తానికి మరో 15 రోజుల్లోనే డ్రాగన్ దూకుడు షురూ కానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సొంతిల్లు లేనివారికి గుడ్ న్యూస్‌.. రూ.15 లక్షలకే లగ్జరీ ఇల్లు!

కొత్త ఫోన్..కొత్త EMI..పాత బిల్లులే! ఐఫోన్ లవర్స్‌కు సోనూ సూద్ కౌంటర్

Dengue Vaccine: త్వరలో మార్కెట్ లోకి డెంగ్యూ నివారణకు వ్యాక్సిన్!

నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు

ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్‌.. హ్యాట్సాఫ్‌!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *