Headlines

ఇద్దరు స్టార్స్ మధ్య నలిగిపోతున్న ఆ డైరెక్టర్


వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న సూర్య తన లైనప్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 50వ సినిమా కోసం భారీ ప్లాన్స్ సిద్ధం చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం మోస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రంగంలోకి దిగనున్నారు. ప్రస్తుతం సూర్య జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేల్, నెక్స్ట్ హెచ్ వినోద్ సినిమాలలో నటించబోతున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తి కాగానే లోకేష్ కనకరాజ్‌తో కలిసి తన 50వ సినిమాను పట్టాలెక్కించనున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాబోయే సూర్య 50వ సినిమా విక్రమ్ క్లైమాక్స్‌లో కనిపించిన రోలెక్స్ పాత్రపై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండటంతో, దాన్ని స్టాండ్ అలోన్ సినిమాగా తీసుకురావడానికి లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి లోకేష్ కనకరాజ్ అల్లు అర్జున్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇది పూర్తైన వెంటనే రోలెక్స్ సినిమాను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి కలైపులి ఎస్ థాను సహా పలువురు నిర్మాతలు పోటీ పడుతున్నట్లు సమాచారం. లోకేష్ తన బన్నీ సినిమాతో పాటు రోలెక్స్ ప్రాజెక్ట్‌పై కూడా దృష్టి సారిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

బయోపిక్స్‌లో ఒదిగిపోతున్న హీరోయిన్లు

హీరోలను డామినేట్ చేస్తున్న విలన్లు

క్రేజీగా కమల్‌ లైనప్‌… షూటింగ్‌ స్టేటసేంటి?

టాలీవుడ్‌లో మరోసారి ముదురుతున్న డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌ రచ్చ

థియేటర్లలో మున్నా భయ్యా రచ్చ.. మూవీగా ‘మిర్జాపూర్’ ఎలా ఉంది?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *