Headlines

ప్రభాస్‌కు కన్ఫ్యూజన్.. ఎలా తేల్చుకుంటారో ఏమో..?


ప్రభాస్ చేతి నిండా సినిమాలు, భారీ బడ్జెట్లు, అగ్ర దర్శకులతో బిజీగా ఉన్నారు. అయితే, ఈ భారీ చిత్రాల మధ్య సమన్వయం చేసుకోవడంలో ఆయనకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఫౌజీ మరియు స్పిరిట్ చిత్రాల విషయంలో ఈ సందిగ్ధత స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం. ప్రభాస్ ఫోకస్ అంతా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ఫౌజీపైనే ఉంది. ఈ చిత్రం డిసెంబర్ 3న విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని తెలిపిన వివరాల ప్రకారం, సెప్టెంబర్ నుంచే ఫౌజీ ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి. ఈ సినిమా ద్వారా ఈమాన్వి హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు.మరోవైపు, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ సినిమా షూటింగ్ ఇప్పటికే 40% పూర్తయింది. మేకర్స్ ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2027 మార్చి 5న విడుదల చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అనుకున్న సమయానికి స్పిరిట్ రావాలంటే నాన్‌ స్టాప్‌గాషూటింగ్ జరగాల్సి ఉంది. అయితే, ఫౌజీ ప్రమోషన్స్ కోసం ప్రభాస్ సమయం కేటాయిస్తే, స్పిరిట్ షూటింగ్‌కు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రెండు చిత్రాలలో ఏ ఒక్కటి ఆలస్యమైనా, దాని ప్రభావం రెండో దానిపై పడటం ఖాయం. ఒకేసారి రెండు సినిమాలతో రాబోతున్న డార్లింగ్ ప్రభాస్ వీటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం :

బయోపిక్స్‌లో ఒదిగిపోతున్న హీరోయిన్లు

హీరోలను డామినేట్ చేస్తున్న విలన్లు

క్రేజీగా కమల్‌ లైనప్‌… షూటింగ్‌ స్టేటసేంటి?

టాలీవుడ్‌లో మరోసారి ముదురుతున్న డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌ రచ్చ

థియేటర్లలో మున్నా భయ్యా రచ్చ.. మూవీగా ‘మిర్జాపూర్’ ఎలా ఉంది?

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *