
చాలా మంది హీరోయిన్ రకరకాల భాషల్లో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసిన చాలా మంది హీరోయిన్స్ విపరీతమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. అయితే ఇలా మెప్పించి ఆడియన్స్ ను ఆకట్టుకున్న కొందరు హీరోయిన్ ఉన్నట్టుండి మాయం అవుతున్నారు. స్టార్స్ హీరోయిన్స్ అవుతారు అనుకునేలోగా ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. నటనకు గుడ్ బై చెప్పేసి కొత్త జీవితాలను మొదలుపెడుతున్నారు. పెళ్లి చేసుకోని సెటిల్ అవుతుంటే మరికొంతమంది కొంతమంది సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఆ లిస్ట్ లో ముందు వరసలో ఉంటుంది ఈ బ్యూటీ. అడపాదడపా సినిమాలు చూస్తూనే అభిమానులను ఆకట్టుకుంటుంది. ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో కవ్వించింది. స్టార్ హీరోలతో ఆడిపాడింది. కట్ చేస్తే కనిపించకుండా పోయింది. టాలీవుడ్ వదిలేసి బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది.
ఆమె ఏజ్ ఇప్పుడు 51 ఏళ్లు.. ఈ వయసులోనూ తరగని అందంతో కవ్విస్తుంది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ అమీషా పటేల్. గదర్ 2 సినిమా తర్వాత మరోసారి హాట్ టాపిక్ అయ్యింది బీటౌన్ హాట్ బ్యూటీ అమిషా పటేల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి బడా హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. బద్రి, నాని, నరసింహుడు లాంటి సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్‌కు కూడా దగ్గరైన ఈ బ్యూటీ ఆతర్వాత బాలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ చేసింది.
అక్కడ వరుసగా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. గదర్ 2 సినిమాతో హీరో సన్నిడియోల్‌తో పాటు హీరోయిన్ అమిషా పటేల్ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యారు. చాలా రోజులుగా వెండితెరకు దూరంగా ఉన్న అమిషా, సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. వరుసగా ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఆ అప్డేట్స్ను ఫాలోవర్స్‌లో షేర్ చేసుకుంటుంది. రీసెంట్ టైమ్సలో అమిషా సోషల్ మీడియా యాక్టివిటీ టాప్‌లో ట్రెండ్ అయ్యింది. ముఖ్యంగా అమ్మడి గ్లామర్ షో హాట్ టాపిక్ అయ్యింది. ఈ రేంజ్లో గ్లామర్ ఇమేజ్ ఉన్న ఈ బ్యూటీ వెండితెర మీద మాత్రం బోల్డ్ సీన్స్ విషయంలో స్ట్రిక్ట్ కండిషన్స్ పెడుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి