Henry Crockcomb Hat Trick: శ్రీలంకతో జరగనున్న 3 వన్డేలు, 3 టీ20ల అంతర్జాతీయ సిరీస్‌కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు జట్లను ప్రకటించింది. హ్యారీ బ్రూక్ రెండు ఫార్మాట్లలో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇటీవల కౌంటీ క్రికెట్లో అద్భుత ఫామ్‌లో ఉన్న 24 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ హెన్రీ క్రోకోంబ్‌కు తొలిసారి వన్డే జట్టులో అవకాశం లభించింది.
వారం రోజుల్లో 2 హ్యాట్రిక్‌లు..
ససెక్స్ తరపున ఆడుతున్న క్రోకోంబ్.. కేవలం 7 రోజుల్లో రెండు హ్యాట్రిక్‌లు సాధించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు తీసిన అతను తొలి ఇన్నింగ్స్‌లో 56 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టాడు.
ఎక్కువమంది చదివినది: Video: ఏం వైస్ కెప్టెన్ ఏంటి సంగతి.. బుడ్డోడిని కెలికిన తిలక్ వర్మ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఆ తర్వాత సెప్టెంబర్ 3న చెల్మ్స్‌ఫోర్డ్‌లో ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. ఈసారి 39 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. వరుస ప్రదర్శనలతో అంతర్జాతీయ అవకాశాన్ని అందుకున్నాడు.
టెస్టు జట్టులోనూ చోటు..
24-year-old Henry Crocombe does it again!🤯
TWO HAT-TRICKS IN TWO GAMES! 🎩🎩
He follows his hat-trick against Somerset last week with another one against Essex today!💥
Finishes with 5 for 39. 👏🔥#ESSvSUS #HenryCrocombe #CountyChampionshippic.twitter.com/ZcaSHzahBZ
— lightningspeed (@lightningspeedk) September 3, 2026
క్రోకోంబ్‌కు ఈ సీజన్లో ఇదే తొలిసారి కాదు. జూన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టు కోసం ప్రకటించిన ఇంగ్లాండ్ జట్టులోనూ అతనికి స్థానం లభించింది. ఇప్పుడు వన్డే జట్టులో చోటు దక్కడంతో అంతర్జాతీయ అరంగేట్రానికి చేరువయ్యాడు.
బలమైన జట్లతో ఇంగ్లాండ్..
వన్డే జట్టులో జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జోస్ బట్లర్, బెన్ డకెట్, విల్ జాక్స్, జో రూట్, ఆదిల్ రషీద్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. రెహాన్ అహ్మద్, టామ్ బాంటన్, సోనీ బేకర్, జోర్డాన్ కాక్స్, లియామ్ డాసన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్లకూ చోటు దక్కింది.
ఎక్కువమంది చదివినది: Video: సెలెక్టర్ల ముందే సెంచరీతో ఇచ్చిపడేసిన ఛోటా ప్యాకెట్.. రీఎంట్రీని ఇక అడ్డుకునేదెవరు?
టీ20 జట్టులోనూ ఆర్చర్, అట్కిన్సన్, బట్లర్, డకెట్, జాక్స్, రషీద్‌తో పాటు జేమ్స్ కోల్స్, అనూరిన్ డొనాల్డ్, సాకిబ్ మహమూద్ తదితరులు ఉన్నారు. రెండు ఫార్మాట్లలోనూ బ్రూక్ నాయకత్వంలో శ్రీలంక సవాల్‌ను ఇంగ్లాండ్ ఎదుర్కోనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..