బెండకాయ అంటేనే జిగురు. కానీ దీని రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇక అద్భుతమైన రుచితో కర కరలాడుతూ ఉండే బెండకాయ ఫ్రైని ఎవరు అయినా సరే ఇష్టంగా తింటారు. కానీ కొంత మంది దీనిలో ఉండే జిగురును చూసి వండటానికి ఇష్టపడరు. కానీ బెండకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన తప్పక తినాలి అంటారు.
అయితే జిగురు లేకుండా ఇలా బెండకాయను వండితే రుచి అదిరిపోతుందంట. దీని కోసం కావాల్సిన పదార్థాల్లోకి వెళితే బెండాకాయలు అరకేజీ, పెరుగు, పచ్చి మిర్చి , ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, నూనె, జీలకర్ర, ఆవాలు, ధనియాల పొడి, గరం మసాలా,కొత్తిమీర.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి అందులో నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడి అయిన తర్వాత అందులో ఆవాలు , జీలకర్ర, ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత పసుపు, పచ్చి మిర్చీ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా చేయడం వలన గ్రేవీ ఎక్కువగా వస్తుంది.
ఇవన్నీ పూర్తిగా వేగిన తర్వాత అందులో కొంచెం పెరుగు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది కూడా పూర్తిగా కలిసేలా చూసుకోవాలి. తర్వాత బెండకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. బెండకాయలు వేయాలి. పెరుగు, నూనెలో బెండకాయలు మంచిగా ఉడికేలా చూసుకోవాలి. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత అందులో ధనియాల పొడి, కొత్తిమీర, అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి.
అంతే రుచికరమైన బెండకాయ కర్రీ రెడీ. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అంతే కాకుండా ఈ విధంగా కూరలో పెరుగు వేసి వండు కోవడం వలన జిగురు లేకుండా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా బెండకాయను జిగురు లేకుండా ఇలా రుచికరంగా వండుకోండి.




