
వైభవ్ సూర్యవంశీ.. ఇండియన్ క్రికెట్‌కు ఫ్యూచర్ సూపర్ స్టార్‌గా మారుతున్నాడు. ఐపీఎల్లో దుమ్మురేపిన ఈ వండర్ కిడ్, ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడి పెద్దగా రాణించలేదు. కానీ జింబాబ్వేపై ఇరగదీశాడు. మూడు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు సాధించి అదరగొట్టాడు. చివరి మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలిచాడు. దీంతో మెల్లమెల్లగా వైభవ్ ట్రాక్‌లోకి వస్తున్నాడంటూ క్రికెట్ అభిమానులు ఖుషీగా ఉన్నారు. అయితే ఈ యువ క్రికెటర్ టాలెంట్ ఐపీఎల్‌తోనే బయటపడిందని అంతా అనుకుంటున్నారు.
కానీ, కాదు.. వైభవ్ సూర్యవంశీ తలరాతను మార్చింది ఐపీఎల్ కానే కాదు. అంతకు ముందే అతని ప్రతిభను గుర్తించారు క్రికెట్ పెద్దలు. అది కూడా విజయవాడ సాక్షిగా వైభవ్ అనే యువ సంచలనం బీసీసీఐ పెద్దల దృష్టిలో పడ్డాడు. ఈ విషయం ఎవరో కాదు టీమిండియా మాజీ క్రికెటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్, తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ వెల్లడించారు. క్వాడ్రాంగ్యూలర్ సిరీస్ ఆడేందుకు విజయవాడకు వచ్చిన సమయంలోనే వైభవ్ ప్రతిభ తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు.
లక్ష్మణ్ మాట్లాడుతూ.. 2024 అండర్-19 ప్రపంచకప్‌కు ముందు జరిగిన ఆ టోర్నీలో వైభవ్ ఆటతీరు సెలెక్టర్లను, కోచ్‌లను బాగా ఆకట్టుకుందని చెప్పారు. ఆ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లలో వైభవ్ ఒకడిగా నిలిచాడని వెల్లడించారు. వైభవ్‌లో అసాధారణమైన బ్యాటింగ్ ప్రతిభ ఉందని, చిన్న వయసులోనే ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం చూపించాడని లక్ష్మణ్ ప్రశంసించారు. అయితే, అంతర్జాతీయ స్థాయిలో మరింత విజయవంతం కావాలంటే ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు.
నైపుణ్యంతో పాటు శారీరక దారుఢ్యం కూడా ఆధునిక క్రికెట్లో కీలకమని, ఫిట్నెస్ను మెరుగుపరుచుకుంటే వైభవ్ భవిష్యత్తులో భారత జట్టుకు కీలక ఆటగాడిగా ఎదిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. యువ ఆటగాళ్లకు సరైన మార్గదర్శకత్వం, క్రమశిక్షణ, ఫిట్నెస్ ఉంటే ప్రపంచ స్థాయిలో రాణించగలరని పేర్కొన్న ఆయన, వైభవ్ సూర్యవంశీ ఆ దిశగా మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి