Headlines

సంజు కంటే అభిషేక్ తోపా.. మరెందుకీ వివక్ష? మండిపడ్డ భారత క్రికెటర్

సంజు కంటే అభిషేక్ తోపా.. మరెందుకీ వివక్ష? మండిపడ్డ భారత క్రికెటర్


టీమిండియా సెలెక్షన్‌ విధానంపై హనుమ విహారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటగాళ్లందరికీ ఒకే ప్రమాణాలు వర్తించకుండా, కొందరిని వేర్వేరు ప్రమాణాలతో అంచనా వేస్తున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యంగా సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఉదాహరణలను ప్రస్తావిస్తూ, భారత జట్టు ఎంపికలో సమానత్వం లేదని వ్యాఖ్యానించారు. ఇంగ్లండ్ పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సంజు శాంసన్‌ను జింబాబ్వే టీ20 సిరీస్‌కు ఎంపిక చేయకపోవడాన్ని విహారి ప్రశ్నించారు. అధికారికంగా అతనికి విశ్రాంతి ఇచ్చామని సెలెక్టర్లు చెప్పినా, గతంలో జట్టులోకి తిరిగి వచ్చి అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాడిని ఈ విధంగా పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదన్నారు.

2026 టీ20 ప్రపంచకప్‌లో సంజు శాంసన్ కీలక పాత్ర పోషించి, ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన విషయాన్ని విహారి గుర్తు చేశారు. ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబర్చి, జట్టు విజయాల్లో కీలకంగా నిలిచాడని తెలిపారు. అలాంటి ఆటగాడికి వరుస అవకాశాలు ఇవ్వకుండా, కొన్ని పేలవమైన ఇన్నింగ్స్‌ల ఆధారంగా విమర్శించడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. మరోవైపు అభిషేక్ శర్మకు వరుస అవకాశాలు లభిస్తున్నప్పటికీ, అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని విహారి పేర్కొన్నారు. చివరి 18 టీ20 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లలో కేవలం మూడు అర్ధశతకాలు మాత్రమే నమోదు చేశాడని, ఇటీవల అతని స్కోర్లు కూడా స్థిరత్వాన్ని ప్రతిబింబించడం లేదని వివరించారు. అయినప్పటికీ అతనిపై ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన విహారి.. ప్రపంచకప్‌కు ముందు ఐదు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడని సంజు స్థానాన్ని కోల్పోయాడు. కానీ తిరిగి వచ్చి టోర్నమెంట్‌లో అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. అదే సమయంలో అభిషేక్ శర్మకు వరుస అవకాశాలు లభిస్తున్నా, అతని ప్రదర్శనపై పెద్దగా చర్చ జరగడం లేదు. ఒకే జట్టులో వేర్వేరు ఆటగాళ్లకు వేర్వేరు ప్రమాణాలు ఎందుకు? అని ప్రశ్నించారు. అయితే అభిషేక్ శర్మపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదని విహారి స్పష్టం చేశారు. ప్రతి ఆటగాడిని వారి ప్రదర్శన ఆధారంగానే అంచనా వేయాలని, ఎంపికల్లో ఒకే విధమైన ప్రమాణాలు పాటించాలన్నదే తన అభిప్రాయమని తెలిపారు. ప్రభసిమ్రన్ సింగ్ వంటి ఆటగాళ్లకూ అవకాశాలు ఇస్తే వారు కూడా మంచి ప్రదర్శనలు చేయగలరని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *