Headlines

అలాంటి పాత్రలు చేయాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన హాట్ బ్యూటీ

అలాంటి పాత్రలు చేయాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన హాట్ బ్యూటీ


చాలా మంది అందాల తారలు నటనతో పాటు గ్లామర్ కు కూడా ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇస్తుంటారు. కొందరు కేవలం నటనను మాత్రమే ఎంచుకుంటూ స్కిన్ షోకు దూరంగా ఉంటున్నారు. అందచందాలతో కంటే తమ పర్ఫామెన్స్ తోనే పాపులర్ అయినా ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా ఇక పై గ్లామర్ రోల్ చేయను అని చెప్పి అనౌన్స్ చేసింది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తాను అని చెప్పుకొచ్చింది. అంతే కాదు ఇండస్ట్రీలో లేడీ మేకర్స్ పెరగాలి, సినిమాల్లో ఫీమేల్ గేజ్ పెరగాలి అంటూ తెలిపింది. అంతే కాదు ఇక గ్లామరస్ పాత్రల కంటే యాక్షన్ రోల్స్ చేయాలని ఉందని చెప్పుకొచ్చింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : అప్పుడు తండ్రితో.. ఇప్పుడు కొడుకుతో..! ఆ స్టార్ హీరో సినిమాలో నయన తార.?

టాలీవుడ్ లో మోస్ట్ గ్లామరస్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది ఈ చిన్నది. ఇప్పుడు యాక్షన్స్ సీన్స్ చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చిన ఆమె ఎవరో కాదు మాళవిక మోహనన్.  హీరోయిన్ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇన్నాళ్లు తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు రాజా సాబ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బోల్తా కొట్టింది.

ఇది కూడా చదవండి : ఆ హీరో నైటీ వేసుకోవడానికి వెనకడుగేశాడు.. అందుకే నేనే ఆ పాత్ర చేశా

2013లో బట్టం బోలే సినిమాతో మలయాళీ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటించిన పెట్టా చిత్రంలో కనిపించింది. ఈ మూవీతో తమిళం ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంది. ధనుష్, విజయ్ దళపతి వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన మాళవిక.. ఇక ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్ రోల్స్ చేయాలని ఉందని తెలిపింది. అలాగే ఇండస్ట్రీలో మహిళామెకర్స్ పెరగాలని, లాపత లేడీస్ సినిమా నన్ను బాగానే ఆకట్టుకుంది.  కిల్ బిల్ లాంటి పాత్ర చేయాలని ఉందని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : అప్పుడు చిన్న పిల్లాడు.. ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు..! అందరం ఒకే కుటుంబంలా ఉండేవాళ్లం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *