Roja Selvamani: అమెరికాలో రోజా కూతురు సంచలనం.. అన్షుకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు.. ఏం చేసిందంటే?

Roja Selvamani: అమెరికాలో రోజా కూతురు సంచలనం.. అన్షుకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు.. ఏం చేసిందంటే?


సీనియర్ నటి, మాజీ మంత్రి ఆర్‌కే రోజా కూతురు అన్షు మాలిక మరో అరుదైన గౌరవం అందుకుంది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఇండియానా యూనివర్సిటీ ఏటా ఒక్కరికి మాత్రమే ప్రదానం చేసే హెర్మన్ బి వెల్స్ అవార్డుకు అన్షు ఎంపికైంది. ఈ విషయాన్ని రోజానే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన భర్త, కూతురితో యూనివర్సిటీలో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. ‘డియర్‌ అన్షు నీ కఠోర శ్రమ, అంకితభావం, ధైర్యం నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాయి. ఇది ఆరంభం మాత్రమే. ఒక చిన్న కలగా మొదలైన నీ ప్రయాణం ఇప్పుడు మాకు అపారమైన గర్వకారణంగా, ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.’ అంటూ తన ఆనందానికి అక్షర రూపమిచ్చారు రోజా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు రోజా కూతురికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా 1961 నుంచి ఇండియానా యూనివర్సిటీ ప్రతి సంవత్సరం ఒక అత్యుత్తమ విద్యార్థికి ఈ ప్రతిష్టాత్మకం ఈ పురస్కారం అందిస్తోంది. చదువుతో పాటు లీడర్ షిప్, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నవారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు.ప్రస్తుతం ఇదే యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ చేస్తోంది అన్షు. చదువుతో పాటు ఆమె కోడింగ్, వెబ్ డెవలప్‌మెంట్ వంటి అంశాలతో పాటు ‘ఆర్ట్ ఫర్ ఎ కాజ్’ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటోంది రోజా కూతురు ఈ క్రమంలోనే ఆమె హెర్మన్ బి వెల్స్ అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డు అందుకున్న వారి పేర్లఇండియానా మెమోరియల్ యూనియన్‌లో శాశ్వతంగా ప్రదర్శించబడుతుంది.

ఇవి కూడా చదవండి

కూతురితో రోజా సెల్వమణి..

కాగా చిన్నప్పటి నుంచే చదువులో చురుకుగా ఉంటోన్న అన్షు రైటర్ గా కూడా సత్తా చాటుతోంది. ఆమె ఇప్పటికే పలు పుస్తకాలు కూడా రాసింది. అలాగే అంతర్జాతీయ వేదికలపై ర్యాంప్ వాక్ లు కూడా చేసింది. ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న అన్షు గొప్ప శాస్త్రవేత్త కావాలని కలలు కంటోంది.

వీడియో ఇదిగో..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *