పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా.. ? తెలుగు ప్రేక్షకులకు తల్లి, అత్త పాత్రలతో సుపరిచితురాలు. ఒకప్పుడు హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దశాబ్దాలుగా సినీరంగంలో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు ఆమె క్రీడారంగంలోనూ రాణిస్తుంది. పవర్ లిఫ్టింగ్ లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయిలో పతకాలు అందుకుంది. ఆమె మరెవరో కాదండి నటి ప్రగతి. తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించి పాపులర్ అయ్యింది. తెలుగు, తమిళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో కనిపించింది. తాజాగా ఇటీవల తన 50వ పుట్టినరోజు సందర్భంగా చిన్నప్పటి నుంచి తన సినీ ప్రయాణం నుంచి మొదలుకుని పవర్ లిఫ్టింగ్ వరకు తన కెరీర్, లైఫ్ గురించి చెబుతూ సోషల్ మీడియాలో స్పెషల్ వీడియో షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరలవుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఏఎన్నార్ ఛీ ఇదేం పాట అన్నారు.. అదే పాటతో చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు..
“ఈ మహిళకు తన ప్రయాణమంతా ఎలాంటి ప్రణాళిక, మార్గదర్శి, ఆంక్షలు, డబ్బు, ప్రేమ, కుటుంబం, లక్ష్యం, ఆసక్తి, ఆదుకోవడానికి ఎవరూ లేరు!!! ఆమెకు ఉన్నదల్లా బలం, మొండితనం, అమాయకత్వం, తెలివితక్కువతనం, తొందరపాటు, అసహనం, త్వరగా నమ్మడం, తన ఇష్టానుసారం జీవితాన్ని గడపాలనే ఎంపిక మాత్రమే.. తాను మంచిదో చెడ్డదో ఆమెకు తెలియదు కానీ… రాజీ పడకుండా ఈ జీవితాన్ని గడపడంలో ఆమె పూర్తిగా సరైనదే!! పిల్లలను పెంచడం, బిల్లులు చెల్లించడం, కడుపు నింపడం, రెండు నంది అవార్డులతో కెరీర్ నిర్మించుకోవడం, దేశానికి పతకం తీసుకురావడం!! ఈ అద్భుతమైన జీవిత చక్రం కోసం పడిన బాధలన్నీ విలువైనవే!! నాకు జన్మనిచ్చినందుకు మా అమ్మకు, అలాగే ఎల్లప్పుడూ నన్ను నేను నమ్ముకుని, “నేను ఏదో ఒకటి సాధిస్తాను, వదిలిపెట్టను” అని చెప్పుకున్నందుకు నాకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను స్వర్ణోత్సవాన్ని పూర్తి చేసుకుంటున్న ఈ తరుణంలో నా హృదయం ఆనందం, గర్వంతో ఉప్పొంగిపోతోంది. వావ్… ఎంత అద్భుతమైన ప్రయాణం !! శభాష్ ప్రగతి మహావది” అంటూ తనను తాను మోటివేట్ చేసుకుంటూ అద్భుతమైన మెసేజ్ రాసుకొచ్చింది ప్రగతి. దీంతో ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్.. కొడుకు సెన్సేషనల్ హీరో.. సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే..
“నేను ఏదో ఒక దారి వెతుక్కుంటాను.. నేను ఓడిపోను” అని తనని తాను నమ్ముకోవడమే ఆమె అసలైన విజయం. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు పడినా కృంగిపోకుండా, తనపై తాను నమ్మకం ఉంచినందుకు తనకు తానే ధన్యవాదాలు చెప్పుకోవడం ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనం. తన పుట్టినరోజు సందర్భంగా ఆమె పంచుకున్న ఈ ‘గోల్డెన్ జూబ్లీ’ ప్రయాణం ఎందరో మహిళలకు ఆదర్శం. “వెల్ డన్ ప్రగతి!” అంటూ నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా హిట్టుతో ఊళ్లో ఇల్లు కట్టేసా.. పుష్ప తర్వాత ఆస్తులు ఇవే.. టాలీవుడ్ నటుడు..
ఎక్కువ మంది చదివినవి : Tollywood : చేసిందే ఒక్క సినిమా.. దెబ్బకు తెలుగు కుర్రాళ్లను పిచ్చెక్కించేసింది.. ఈ కేరళ అందాన్ని గుర్తుపట్టారా.. ?