Headlines

హిట్లు లేకున్నా హవా తగ్గలేదు.. సోషల్ మీడియాలో టాలీవుడ్ హీరోయిన్లదే ఫుల్ క్రేజ్!

హిట్లు లేకున్నా హవా తగ్గలేదు.. సోషల్ మీడియాలో టాలీవుడ్ హీరోయిన్లదే ఫుల్ క్రేజ్!


వెండితెర మీద వరుస హిట్స్ ఉన్నా లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం మన హీరోయిన్స్ క్రేజ్ మామూలుగా లేదు. థియేటర్లలో పెద్దగా సక్సెస్‌లు లేకపోయినా సరే ట్రెండింగ్‌లో మాత్రం ఎప్పుడూ టాప్‌లో ఉంటున్నారు. ఎయిర్ పోర్ట్ లుక్స్, డిన్నర్ డేట్స్ వీడియోలతో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తున్నారు. ఇంతకీ సోషల్ మీడియాలో ఈ భామలు క్రియేట్ చేస్తున్న బజ్ వాళ్ల కెరీర్‌కు నిజంగా హెల్ప్ అవుతుందా..? సీతగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న మృణాల్ థాకూర్‌కు రీసెంట్ గా పెద్ద బ్లాక్ బస్టర్స్ పడలేదు. భారీ ఆశలు పెట్టుకున్న డెకాయిట్ కూడా బాక్సాఫీస్ దగ్గర సో సోగానే నడిచినా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ క్రేజ్ అస్సలు తగ్గలేదు. సౌత్‌లో పెద్దగా సందడి లేకపోయినా బాలీవుడ్‌లో రెగ్యులర్‌గా కెమెరా కంట పడుతున్నారు మృణాల్‌. తన గ్లామరస్ లుక్స్‌తో ఎప్పుడూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తూనే ఉన్నారు. సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నా, తన డిఫరెంట్ ఫ్యాషన్ సెన్స్ తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు మల్టీటాలెంటెడ్ బ్యూటీ శ్రుతి హాసన్‌. ఎయిర్‌పోర్ట్‌ లుక్స్‌, వర్కౌట్ వీడియోలతో నిత్యం ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతూనే ఉంటారు ఈ బ్యూటీ. టాలీవుడ్‌లో సాలిడ్ సక్సెస్ లేకపోయినా సోషల్ మీడియాలో శృతి ఫాలోయింగ్ మాత్రం నెక్ట్స్‌ లెవెల్లో ఉంటోంది. ఉప్పెనతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బేబమ్మకి.. ఆ తర్వాత ఆ స్థాయి సక్సెస్ దక్కలేదు. షార్ట్ టైమ్‌లోనే స్టార్‌ లీగ్‌లోకి వచ్చిన శ్రీలీల కూడా మరో బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ బ్యూటీస్‌కి కెరీర్‌లో కాస్త గ్యాప్ వచ్చినా ఆన్‌లైన్‌లో మాత్రం చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. టాలీవుడ్‌కు బ్రేక్‌ ఇచ్చి బాలీవుడ్‌ మీద కాన్సన్‌ట్రేట్ చేస్తున్న ఈ భామలు… అక్కడ పాపరాజీస్‌కు హాట్‌ ఫేవరెట్‌గా మారిపోయారు. మరి ఈ జోష్ అందాల భామల బిగ్ స్క్రీన్ ఇమేజ్‌ను కూడా మార్చేస్తుందేమో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Burj Khalifa: గుడ్‌న్యూస్.. యూపీఐతో బుర్జ్ ఖలీఫా టికెట్లు

వింత రెస్టారెంట్.. హోటల్ లోపల 26 సమాధులు

మధ్యాహ్నం వేళ నీరసంగా అనిపిస్తోందా.. ఇదిగో సరికొత్త ట్రిక్ ‘కాఫీ నాప్’

ఇతను బస్సు డ్రైవరా.. కుబేరుడా!

మీ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ సురక్షితమేనా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *