బిగ్ బాస్ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది శ్రీ సత్య. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన జీవితంలోని అనేక కీలక ఘట్టాలను పంచుకున్నారు. ఈ సంభాషణలో ఆమె తన లిప్ సర్జరీ అనుభవం, సినీ రంగంలోకి ప్రవేశం, వ్యక్తిగత అభిరుచులు, టిల్లు 2 చిత్రం నుండి తన పాత్రను తొలగించడం వంటి విషయాలపై తెలిపారు. శ్రీ సత్య తన పెదవులకు సర్జరీ చేయించుకున్నట్లు అంగీకరించారు. “చిన్నపిల్ల ఫేస్” గా ఉండటం వల్ల మెచ్యూరిటీ లేదని కొందరు చెప్పడంతో, మొదట తక్కువగా చేయించుకున్నానని, అది ఎవరికీ తెలియలేదని తెలిపారు. అయితే, ఆ తర్వాత మరింత ఎక్కువ చేయించుకుని, తనంతట తానే పెదవుల షేప్‌ను మార్చుకునే ప్రయత్నం చేయగా, అది వికటించిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. డాక్టర్లు “నీ ఫేస్‌కి ఎక్కువ సెట్ అవ్వదు” అని చెప్పినప్పటికీ, తాను వినలేదని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల తన ముఖం చూసుకోవడానికి కూడా ఇబ్బంది పడినట్లు ఆమె తెలిపారు.
ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..
తొలుత శ్రీ సత్యకు ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కావాలనే కోరిక ఉండేది. ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత ఫ్రెండ్స్‌తో తిరుపతి వెళ్లాలనుకున్నప్పుడు, తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో రెండు రోజులు అలకబూనారు. ఆ సమయంలో టీవీలో మిస్ విజయవాడ పోటీ ప్రకటన చూసిన తన తండ్రి ఆమెను ఆడిషన్‌కు తీసుకెళ్లారు. అప్పటికి కళ్లజోడు ధరించి, హాస్టల్ నుండి వచ్చిన తాను సెలెక్ట్ అవ్వనని అనుకున్నప్పటికీ, తండ్రి ప్రోత్సాహంతోనే ఆడిషన్ ఇచ్చారు. ఆమె తల్లి, అక్కలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, తండ్రి అండగా నిలిచారు. మిస్ విజయవాడ గెలిచేంత వరకు తల్లి తనతో మాట్లాడలేదని శ్రీ సత్య గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత మిస్ ఏపీగా కూడా ఎంపికయ్యారు. మోడలింగ్ రంగంలో కొనసాగుతున్నప్పుడే గోదావరి నవ్వింది అనే చిత్రంలో నటించారు. తన ఇంటర్ ఫలితాలు షూటింగ్‌లోనే వచ్చినట్లు ఆమె తెలిపారు. 2019లో సీరియల్స్‌లోకి ప్రవేశించారు. తనకు నటన కంటే ర్యాంప్ వాకింగ్ అంటేనే ఎక్కువ ఇష్టమని, నటన రాదని శ్రీ సత్య నిస్సందేహంగా చెప్పారు. అయితే, ఒక బ్రేకప్ తర్వాత వచ్చిన ఆఫర్‌తో నటనలోకి వచ్చానని పేర్కొన్నారు. ఏ నటికైనా చివరి లక్ష్యం సినిమానే అని ఆమె అన్నారు.
ఎక్కువమంది చదివినవి : K. Raghavendra Rao: ఆ హీరోయిన్‌తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..
టిల్లు 2 సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర చేశానని, డబ్బింగ్ కూడా పూర్తయిందని శ్రీ సత్య వెల్లడించారు. అయితే, చివరి నిమిషంలో తన పాత్రను పూర్తిగా తొలగించడం తీవ్రంగా బాధించిందని తెలిపారు. ఒక ప్రాజెక్ట్ కోసం తాను చాలా రోజుల పాటు ఎదురు చూశానని, దానిపై దృష్టి సారించి పని చేసిన తర్వాత ఫలితం లేకపోతే బాధ ఉంటుందని చెప్పారు. ఈ అనుభవం ద్వారా తాను ఒక కీలకమైన పాఠం నేర్చుకున్నానని, అదేంటంటే ఒక ప్రాజెక్ట్ పూర్తయ్యి విడుదలయ్యే వరకు దాని గురించి ఎవరికీ చెప్పకూడదు అని ఆమె స్పష్టం చేశారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..
శ్రీ సత్య ఇన్ స్టా పోస్ట్..
ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్లో తనే స్పెషల్..