Headlines

రెండేళ్లకు ఒక సినిమా కాదు.. ఒకే ఏడాది రెండు పాన్ ఇండియా రిలీజ్‌లు.. ట్రెండ్ మార్చిన ప్రభాస్, యశ్!

రెండేళ్లకు ఒక సినిమా కాదు.. ఒకే ఏడాది రెండు పాన్ ఇండియా రిలీజ్‌లు.. ట్రెండ్ మార్చిన ప్రభాస్, యశ్!


పాన్ ఇండియా హీరో అంతా రెండేళ్లకు ఒక సినిమా చేయాలన్న అన్‌ రిటర్న్‌ రూల్‌ ఫాలో అవుతున్నారు. ఈ టైమ్‌లో ఇద్దరు స్టార్ ఈ రూల్‌ను బ్రేక్ చేస్తున్నారు. ఇన్నా్‌ళ్లు ఏళ్ల తరబడి ఫ్యాన్స్‌ను వెయిటింగ్‌లో పెట్టిన హీరోలు.. ఈ ఏడాది డబుల్‌ రిలీజ్‌లతో అలరిస్తున్నారు. ఒక్కసారిగా ఇంత చేంజ్‌ తీసుకువచ్చిన ఆ హీరోలు ఎవరు..? పాన్‌ ఇండియా సినిమా అంటే కనీసం రెండేళ్ల పాటు ఎదురుచూడాల్సిందే. భారీ హంగులతో తెరకెక్కే ఈ సినిమాల కోసం హీరోలు కూడా రెండు మూడేళ్లు కేటాయించాల్సిందే. గత కొన్నేళ్లుగా టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో ఇదే ట్రెండ్ నడుస్తోంది. కానీ ఈ ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ బాక్సాఫీస్‌ కింగ్ ప్రభాస్‌ గేరు మార్చారు. గతంలో ఒక్కో సినిమా కోసం ఎంతో కాలం ఎదురుచూసేలా చేసిన ప్రభాస్, ఇప్పుడు తన ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇస్తూ ఒకే ఏడాది రెండు పాన్ ఇండియా రిలీజ్‌లతో సిద్ధమయ్యారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ‘ది రాజాసాబ్’తో థియేటర్లలో సందడి చేశారు ప్రభాస్‌. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో వింటేజ్‌ ప్రభాస్ స్వాగ్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యాన్స్‌. రాజాసాబ్ తరువాత మరోసారి లాంగ్ బ్రేక్ వచ్చినా… క్యాలెండర్ ఇయర్ మారకముందే మరో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమాను ఇదే ఏడాది డిసెంబర్ 3న రిలీజ్‌ చేసేందుకు మేకర్స్ డేట్‌ లాక్ చేశారు. ప్రభాస్‌తో పాటు కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కూడా ఇదే ఏడాది టాక్సిక్‌, రామాయణ సినిమాలతో సందడి చేయబోతున్నారు. దీపావళి కానుకగా రామాయణ ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకన్నా ముందే ఆగస్టు 26న, టాక్సిక్‌ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ హీరోల స్పీడ్ చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతుంటే.. పక్కా ప్లానింగ్ ఉంటే మిగతా హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలను ఫాస్ట్‌గా కంప్లీట్ చేయొచ్చంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Burj Khalifa: గుడ్‌న్యూస్.. యూపీఐతో బుర్జ్ ఖలీఫా టికెట్లు

వింత రెస్టారెంట్.. హోటల్ లోపల 26 సమాధులు

మధ్యాహ్నం వేళ నీరసంగా అనిపిస్తోందా.. ఇదిగో సరికొత్త ట్రిక్ ‘కాఫీ నాప్’

ఇతను బస్సు డ్రైవరా.. కుబేరుడా!

మీ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ సురక్షితమేనా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *