Headlines

House Construction Cost: 100 గజాల స్థలంలో ఇల్లు కడుతున్నారా? ఒక అంతస్తు నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

House Construction Cost: 100 గజాల స్థలంలో ఇల్లు కడుతున్నారా? ఒక అంతస్తు నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?


House Construction Cost: సొంతిల్లు కట్టుకోవాలనేది ప్రతి ఒక్కరి అతిపెద్ద కల. అయితే పెరుగుతున్న స్థలం ధరలు, నిర్మాణ సామగ్రి ధరలు చూసి సామాన్యుడు కట్టలేని పరిస్థితి నెలకొంటుంది. కానీ ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండటం తప్పనిసరి. ఎంత కష్టమొచ్చినా కనీసం అందులో జీవించేందుకు వీలుగా తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మించుకుంటున్నారు సామాన్యులు. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యతరగతి కుటుంబాలకు 100 గజాలు (సుమారు 900 చదరపు అడుగులు) స్థలంలో ఒక సౌకర్యవంతమైన ఇల్లు కట్టేందుకు ఎంతో ఖర్చవుతుందో ఒక సామాన్యుడు తన ఇంటిని నిర్మించుకున్న ఖర్చు ఆధారంగా లెక్కలేసుకుందాం. 100 గజాల స్థలంలో కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా విశాలమైన డబుల్‌ బెడ్‌రూమ్‌తో ఒక అంతస్తులో నిర్మాణం చేయవచ్చు. ప్రస్తుతం నిర్మాణ నాణ్యతను బట్టి చదరపు అడుగుకు సాధారణ మెటీరియల్‌తో అయితే రూ.1,100 నుండి రూ.1,200 వరకు ఖర్చవుతుంది. అదే మీరు నాణ్యమైన బి క్లాస్ మెటీరియల్‌ వాడితే రూ.1,300 నుండి రూ.1,600 వరకు ఖర్చవుతుంది. ఈ లెక్కన 100 గజాల స్థలంలో ఇంటిని నిర్మించడానికి సుమారు రూ.11 లక్షల నుండి రూ.14.4 లక్షల వరకు అవసరమవుతుంది.

Auto Tips: ఏడాదిలో కారు, బైక్ కొనడానికి ఏ నెల అనుకూలం? వేల రూపాయలు ఆదా చేసే ట్రిక్స్‌..!

ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే.. ఈ వ్యయం కేవలం అంచనా మాత్రమే అని గమనించండి. ఎందుంటే మీరు ఉండే గ్రామం గానీ, సిటీగానీ ఏరియాను బట్టి ధరల్లో తేడా ఉండవచ్చు. మీ ప్రాంతంలో దొరికి మెటీరియ్‌ ఖర్చుల్లో కూడా తేడా ఉండవచ్చు. ధర ఇంకా ఎక్కువగా కావచ్చు. తప్ప ఈ రోజుల్లో మరి తక్కువ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే రోజురోజుకు సిమెంట్‌, స్టీల్‌, డోర్స్‌ మెటీరియల్‌, కంకర, ఇసుక, కూలీల ఖర్చు, ఇల్లు నిర్మించే మెస్త్రీల ఖర్చు పెరిగిపోతోంది.

ఇంటి నిర్మాణానికి ఏయే మెటీరియల్‌కు ఎంత ఖర్చు అవుతుంది(అంచనా)

మీరు వంద గాజాలలో ఇంటిని నిర్మిస్తున్నట్లయితే ఇంటి నిర్మాణానికి అయ్యే మెటీరియల్‌ ఖర్చు అంచనా రూంపలో చూద్దాం. ఇంటి నిర్మాణంలో అత్యంత భాగం నిర్మాణ సామగ్రికే ఖర్చువుతంది. మంచి ప్లాన్‌తో నిర్మాణం చేస్తే మీకు తక్కువ ఖర్చుతోనే పూర్తి చేసుకోవచ్చు. టీరియల్ కొంటే కాంట్రాక్టర్ల చేతిలో మోసపోకుండా మన డబ్బును ఆదా చేసుకోవచ్చు. 100 గజాల ఇంటి నిర్మాణానికి అయ్యే ప్రధాన సామగ్రి వివరాలను చూస్త ఒక అంతస్తు ఇంటి నిర్మాణానికి సుమారు 400 నుండి 450 సిమెంట్ బస్తాలు అవసరమవుతాయి. దీనికి రూ.1.7 లక్షల నుండి రూ.2.0 లక్షల వరకు ఖర్చవుతుంది. పిల్లర్లు, స్లాబ్ పటిష్టంగా ఉండడం కోసం దాదాపు 3 టన్నుల ఐరన్ అవసరం పడుతుంది. దీనిని రూ.2.2 లక్షల నుండి రూ.2.6 లక్షల వరకు ఉంటుంది. ఇక గోడల నిర్మాణం విషయానికొస్తే.. ఇక్కడ ఇటులు 20,000 నుండి 24,000 వరకు అవసరమవుతాయి. వీటి ధర రూ.1.4 లక్షల నుండి రూ.1.8 లక్షల మధ్యలో కావచ్చు. వీటితో పాటు కాంక్రీట్, ప్లాస్టరింగ్ కోసం వాడే ఇసుక, కంకర కోసం మరో రూ.1.2 లక్షల నుండి రూ.1.5 లక్షల వరకు కేటాయించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి



మేస్త్రీ, కూలీల ఖర్చు ఎంత?

ఇక ముఖ్యంగా ఇంటి నిర్మాణానికి మెటీరియల ఎంత ముఖ్యమో నిర్మాణం చేసే మేస్త్రీ, కూలీలు కూడా చాలా ముఖ్యం. మీరు ఇంటి నిర్మాణం కోసం మంచి అనుభవం ఉన్న మేస్త్రీని ఎంచుకుంటే ఇల్లు నాణ్యతతో ఉంటుంది. సాధారణంగా మొత్తం నిర్మాణ ఖర్చులో దాదాపు 25 శాతం వరకు కూలి (లేబర్) ఖర్చులకే సరిపోతుంది. ప్రస్తుతం 900 చదరపు అడుగుల వైశాల్యానికి కాంట్రాక్టర్లు చదరపు అడుగుకు రూ.220 నుండి రూ.260 వరకు ఛార్జ్ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రూ.300 నుంచి రూ.350 వరకు ఛార్జీ చేస్తుంటారు. మీ ప్రాంతం బట్టి మేస్త్రీ, కూలీల ధర ఉంటుందని గుర్తించుకోండి. ఇల్లు నిర్మాణానికి లేబర్ చార్జీలు మొత్తం రూ.2.0 లక్షల నుండి రూ.2.3 లక్షల వరకు అవుతాయని గుర్తించుకోండి.

ఇది కూడా చదవండి: Electric Bike: ఒక్కసారి చార్జ్ చేస్తే 260 కి.మీ.. కొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. ధర ఎంతంటే..!

ఇల్లు పూర్తయిన తర్వాత ఫినీషింగ్ పనులైన ప్లంబింగ్, వైరింగ్, నేలపై టైల్స్ వేయడం, గోడలకు రంగులు వేయడం వంటి పనులు కూడా ముఖ్యమో. వీటి ఖర్చు రూ.2.0 లక్షల నుండి రూ.2.4 లక్షల వరకు అవుతుంది. ఇలా 100 గజాల స్థలంలో మీరు ఇల్లును నిర్మించుకున్నట్లయితే మొత్తం ఖర్చు సుమారు 11 లక్షల రూపాయల నుంచి 14 లక్షల వరకు అవుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. మీ ఇంటికి కాస్లీ మెటీరియల్‌, ఇంకా పెద్ద పెద్ద హంగులతో నిర్మించుకుంటే ఇంకా ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉందని గుర్తించుకోండి. ఇది సాధారణంగా నిర్మించుకునే ఇల్లుు అయ్యే ఖర్చు మాత్రమే అంచనా ద్వారా అందిస్తున్నాము.

ఇది కూడా చదవండి: Personal Finance: చిన్న పొదుపు-పెద్ద లాభాలు.. రోజుకు రూ.100 పెట్టుబడితో 1 కోటి రూపాయలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *