సోషల్ మీడియాలో సినీతారలు చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ సినిమా అప్డేట్స్, వాటితో పాటే తన హాట్ హాట్ ఫోటోషూట్స్‌ను షేర్ చేస్తుంటారు. అలాగే తమ పర్సనల్ విషయాలు కూడా పంచుకుంటారు. తాజాగా ఓ హీరోయిన్ తన ఇన్‌స్టా వీడియలో తన మసాజ్ వీడియోను పంచుకున్నారు. దాంతో పాటే పాటు అందుకు సంబంధించిన ఖర్చును కూడా అందరితో షేర్ చేసుకుని ఇప్పుడు నెట్టింట అందర్నీ అవాక్కయ్యేలా చేశారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ఆమె పేరే అంజు కురియన్. మలయాళీ, తమిళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అంజు కురియన్.. ఎప్పుడూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటుంటారు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను తన ఫాలోవర్స్‌తో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే అంజు.. బాలిలో తాను చేయించుకున్న ఖరీదైన స్పా మసాజ్ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశారు. స్పా చేయించుకున్న వీడియోను షేర్ చేయడమే కాదు.. అందుకు సంబంధించిన డీటెల్స్ను కూడా తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు అంజు.జపాన్ లో అత్యంత ఖరీదైన స్పా మసాజ్ తాను చేయించుకున్నానని.. అందుకు సంబంధించిన బిల్లును పంచుకున్నారు అంజు. అందులో ఆమె చెప్పినట్లు ఆ మసాజ్ ధర రూ.7.25 లక్షలుగా ఉంది.ప్రస్తుతం అంజు షేర్ చేసిన వీడియోతోపాటు ఆ బిల్లు చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మగువలూ.. మీ అందాన్ని మరింత పెంచే చిట్కా ఇదే!
‘కాంతార’లాంటి అడవి.. కాపలా కాస్తున్న నాగదేవత
వామ్మో.. ఆ రోడ్డు పై ఘోస్ట్ సైకిల్.. తల, మొండెం లేకుండానే..
భార్య కోసం.. రేడియో టవర్ ఎక్కిన యువకుడు
వంద రోజులు ఒంటరి జీవితంపై ప్రయోగం!