బంగారం ధరలు అనేవి ఎప్పుడూ మారుతూ ఉంటాయి. ఎల్లప్పుడూ హెచ్చుతగ్గులు నమోదవుతూ ఉంటాయి. రోజూ ఒకేలా బంగారం ధరలు అనేవి అసలు ఉండవు. అంతర్జాతీయ పరిణామాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ట్యాక్సులను బట్టి రేట్లలో మార్పులు ఉంటాయి. గత ఏడాదిగా పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఏకంగా తులం బంగారం రూ.1.90 లక్షలకు చేరుకుని ఆల్ టైం రికార్డ్ నమోదు చేయగా.. ప్రస్తుతం రూ.1.50 లక్షల వద్ద కొనసాగుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు కాస్త ఊరట చెందుతున్నారు. అయితే బంగారం విక్రయించే షాపుల యజమానులకు ఎంత లాభం వస్తుందనే డౌట్ చాలామందికి ఉంటుంది. దీనికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
మేకింగ్ ఛార్జీల వల్ల..
మేకింగ్ ఛార్జీల వల్ల బంగారం షాపులకు ఆదాయం అనేది వస్తుంది. మీరు కొనే ఆభరణం డిజైన్‌ను బట్టి మేకింగ్ ఛార్జీలు అనేవి ఉంటాయి. మీ డిజైన్ క్లిష్టంగా ఉంటే మేకింగ్ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. గ్రాముకు రూ.300 నుంచి రూ.వెయ్యి వరకు ఉంటుంది. ఈ సొమ్ము నేరుగా షాపు యజమానికి వెళుతుంది. ఇక ఆభరణాల తయారీలో తరుగు కొంతమొత్తం పోతుంది. దాదాపు 10 శాతం నుంచి 18 శాతం వరకు ఇది ఉండే అవకాశముంది. ఆభరణం తయారు చేసేటప్పుడు ఇది కొంత వృథా అవుతుంది. ఉదాహరణకు మీరు 10 గ్రాముల గోల్డ్ కొంటే 1.5 గ్రాముల బంగారానికి అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా షాపులకు డబ్బు తెచ్చిపెడుతుంది. ఇక రాళ్లతో కూడిన ఆభరణాలు కొనుగోలు చేసినప్పుడు బంగారంతో పాటు వాటి ధరలను లెక్కిస్తారు. అదే మీరు విక్రయించేటప్పుడు రాళ్లను తీసివేసి లెక్కిస్తారు. దీని వల్ల దుకాణాదారుడికి లాభం వస్తుంది. దీంతో కస్టమర్లు రాళ్లు లేని బంగారాన్ని కొనుగోలు చేస్తే మంచింది. అలాగే మేకింగ్ ఛార్జీలను తగ్గించేలా మాట్లాడుకోవాలి. దీని వల్ల కస్టమర్‌కు లాభం అనేది జరుగుతుంది.
తులంపై ఎంత లాభం ఉంటుంది..?
ఇక తులం బంగారంపై షాపు యజమానికి రూ.3 వేల నుంచి రూ.7 వేల వరకు లాభం అనేది వస్తుందని చెబుతున్నారు. ఇక పెద్ద షాపుల్లో మేకింగ్ ఛార్జీల పేరుతో ఎక్కువ వసూలు చేస్తారు. దీని వల్ల లాభం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ధర తక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు చేసి ధర పెరిగాక అమ్మినప్పుడు కూడా అదనపు ఆదాయం వస్తుంది. ఇలా బంగారం దుకాణాదారులకు ఆదాయం అనేది వస్తుందని చెప్పవచ్చు. ధరలు పెరిగిన క్రమంలో చాలామంది బంగారం కొనుగోళ్లు తగ్గిపోయాయి.