Fuel Supply: తెలంగాణలో ఇందన కొరతపై బిగ్‌ అప్‌డేట్‌.. పెట్రోల్‌ సరఫరాపై మంత్రి ఏమన్నారంటే?

Fuel Supply: తెలంగాణలో ఇందన కొరతపై బిగ్‌ అప్‌డేట్‌.. పెట్రోల్‌ సరఫరాపై మంత్రి ఏమన్నారంటే?


రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ సరఫరాపై వస్తున్న పుకార్ల పై రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. పెట్రోల్,డీజిల్ సరఫరాపై జనాలు ఎవరూ ఆందోళన చెందవద్దని.. మన రాష్ట్రంలో ప్రజలకు కావల్సినంత ఇంధనం అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో వచ్చే అనవసరమైన పుకార్లను నమ్మి ప్రజలు ఎవరూ ఆందోళనకు గురికావద్దని మంత్రి ఉత్తమ్ అన్నారు.

రాష్ట్రంలో ఇంధన సరఫరా పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని.. ఫిర్యాదుల కోసం 1967 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తెచ్చామన్నారు. అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా..వ్యవసాయ అవసరాలకు అవసరమైన డీజిల్ సరఫరాకు ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఎప్పటికప్పుడు జిల్లాల స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో మానిటరింగ్ కమిటీ పర్యవేక్షణ చేస్తుందన్నారు.

రాష్ట్రంలో 210 శాతం డీజిల్, 132 శాతం పెట్రోలు సరఫరాను పెంచమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు పెట్రొల్,డీజిల్ కలిపి 36,404 KL సరఫరా అవుతుందన్నారు. అంటే డీజిల్ 7348 KL నుంచి 22782 KLలకు పెరగ్గా, పెట్రోల్‌ 5,883 KL నుంచి 13622 KLలకు పెరిగింది. అంటే సగటున రోజువారీ మీద రెండు కలిసి 175 శాతం అధికంగా ఇంధన సరఫరా చేస్తున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *