Tollywood: ఈ టాలీవుడ్ యాంకరమ్మకు హైదరాబాద్‌లో 20 కోట్ల లగ్జరీ విల్లా ఉందా? ఎట్టకేలకు అసలు విషయం చెప్పేసిందిగా

Tollywood: ఈ టాలీవుడ్ యాంకరమ్మకు హైదరాబాద్‌లో 20 కోట్ల లగ్జరీ విల్లా ఉందా? ఎట్టకేలకు అసలు విషయం చెప్పేసిందిగా


యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించింది స్రవంతి చొక్కారపు. తన చురుకైన మాటలు, అందంతో బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం టీవీ ప్రోగ్రామ్స్, రియాలిటీ షోస్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సినిమా ఈవెంట్స్, అవార్డు వేడుకలు.. ఇలా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏ కార్యక్రమంలోనైనా స్రవంతి నే కనిపిస్తోంది. కాగా ఎప్పుడూ ట్రెడిషినల్ దుస్తులతో గ్లామరస్ గా కనిపించే ఈ యాంకరమ్మ భారీగా సంపాదిస్తోందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే రూ. 20 కోట్లతో హైదరాబాద్‌లో ఒక లగ్జరీ ఇల్లు కూడా కొనేసిందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై స్వయంగా క్లారిటీ ఇచ్చింది స్రవంతి. ఇటీవల గోదారి గట్టుపైన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యాంకర్ మంజూష మాట్లాడుతూ.. నీ గురించి బాగా వైరల్ అయిన ఫేక్ న్యూస్ చెప్పమని స్రవంతిని అడిగింది. దీనికి ఆమె నాకు 20 కోట్ల విల్లా ఉందని వచ్చిందని చెప్పింది. అసలు అలాంటిది ఎక్కడుంది, 20 కోట్లు కాదు కదా? కనీసం 2 కోట్లు విలువ చేసే విల్లా కూడా లేదని ఆన్సర్ ఇచ్చిందీ స్టార్ యాంకరమ్మ. అయితే మరి నీ మెడలో ఉన్న నెక్లెస్ ఒరిజనలేనా? అని యాంకర్ అడగ్గా.. ఒరిజినలే కాకపోతే ఇది బ్రాండ్ అండార్స్‌మెంట్ అని చెప్పింది స్రవంతి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. తనకు ఎలాంటి లగ్జరీ విల్లా లేదని స్రవంతి ఒక్క ముక్కలో క్లారిటీగా చెప్పేసింది. ఇదే సమయంలో భవిష్యత్‌లో మంచి ఇల్లు కొనాలనే ఆకాంక్ష అందరికీ ఉంటుందని ఆమె తెలిపింది.

కాగా అనంతపురం జిల్లా కదిరికి చెందిన స్రవంతి.. చిన్న వయసులోనే హైదరాబాద్‌కు వచ్చేసింది. తొలుత హాస్టల్‌లోనూ ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నించింది. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాలలో చిన్నాచితకా పాత్రలు వేసింది. ఆ తర్వాత ఓ యూట్యూబ్ ఛానెల్‌లో యాంకర్‌గా సినిమా రివ్యూలు, ఇతర అప్‌డేట్స్ ఇస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత హోస్ట్ గానూ తన ట్యాలెంట్ ప్రూవ్ చేసుకుంది. పుష్ప ది రైజ్ రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్- సుకుమార్‌లతో చిత్తూరు యాసలో మాట్లాడుతూ స్రవంతి చేసిన ఇంటర్వ్యూ బాగా హైలెట్ అయ్యింది. దీంతో ఈ ముద్దుగుమ్మ పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం ఈ యాంకరమ్మ పలు సినిమాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

ఇవి కూడా చదవండి

గాయపడ్డ సింహం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో యాంకర్ స్రవంతి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *