సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యానిమల్ విజయంతో దూసుకుపోతున్న సందీప్, ఈ సినిమాను ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా బడ్జెట్, షూటింగ్ రోజుల విషయంలో కచ్చితమైన నియమాలను పాటిస్తున్నారు.గత దశాబ్ద కాలంలో ప్రభాస్ నటించిన చిత్రాలన్నీ భారీ బడ్జెట్‌తో, రెండూ మూడూ ఏళ్లపాటు సెట్స్‌పై ఉన్నవే. సాహో, సలార్, కల్కి వంటి చిత్రాలకు ప్రభాస్ వందల రోజుల కాల్ షీట్స్ కేటాయించారు. అయితే, స్పిరిట్ విషయంలో మాత్రం సందీప్ రెడ్డి వంగా రూటు మార్చారు. కేవలం 100 రోజుల్లోనే షూటింగ్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తయిందని దర్శకుడు తెలిపారు. మిగిలిన ప్రధాన షెడ్యూల్స్‌ను హైదరాబాద్‌లోనే ప్లాన్ చేస్తున్నారు. సందీప్ పక్కా ప్రణాళికతో స్పిరిట్ గత పదేళ్లలో ప్రభాస్ చేస్తున్న అత్యంత తక్కువ బడ్జెట్ చిత్రంగా నిలవబోతోంది. వంగా మార్క్ యాక్షన్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.