Headlines

Jabardasth Nookaraju: పూరి గుడిసెలో బతుకులు.. జ్వరం వస్తేనే యాపిల్స్ తినేవాళ్లం.. ఎన్నో కష్టాలు అనుభవించా.. జబర్దస్త్ నూకరాజు..

Jabardasth Nookaraju: పూరి గుడిసెలో బతుకులు.. జ్వరం వస్తేనే యాపిల్స్ తినేవాళ్లం.. ఎన్నో కష్టాలు అనుభవించా.. జబర్దస్త్ నూకరాజు..


బుల్లితెరపై కామెడీ నటుడిగా పాపులర్ అయ్యాడు నూకరాజు. ముఖ్యంగా జబర్దస్త్, పటాస్ కామెడీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం టీవీలో పలు షోలలో సందడి చేస్తున్నాడు. అలాగే తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా యూట్యూబ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నూకరాజు తన లైఫ్ గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి పంచుకున్నాడు. చిన్నప్పుడు జీవితంలో ఎదురైన కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. అలాగే ప్రేమ, సంబంధాలు, శ్రీదేవి డ్రామా కంపెనీ అనుభవాలు, కుటుంబ కష్టాల గురించి వెల్లడించారు. శ్రీదేవి డ్రామా కంపెనీ తనకు ఒక మధురమైన జ్ఞాపకమని నూకరాజు పేర్కొన్నారు. ఆ షో కోసం తాను, ఇమ్ము సహా అందరూ ప్రాణం పెట్టామని, ఏ రోజూ నిర్లక్ష్యం చేయలేదని తెలిపారు. అయితే, రానురాను షెడ్యూల్‌కి ఒక ఎపిసోడ్ మాత్రమే చేయడం, నాలుగు ఎపిసోడ్లు వచ్చేవి రెండు ఎపిసోడ్లుగా మారడం వంటి మార్పులు తమను బాధపెట్టాయని చెప్పారు. తాము రెగ్యులర్ అవుతున్నామనే మాటను తీసుకోలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

ఇక తన ఆర్థిక పరిస్థితి గురించి చెప్పడానికి ఏమీ దాచడం లేదని, ఊర్లో ఇల్లు కట్టుకున్నానని తెలిపారు. ఒకప్పుడు తమది పాక (పూరి గుడిసే) అని, వర్షం వస్తే ఒక పక్క తాము, ఒక పక్క వర్షం కురిసేదని గుర్తు చేసుకున్నారు. తన తండ్రికి రోగం వచ్చినప్పుడు బంగారం అమ్మడం, తాకట్టు పెట్టడం వంటివి జరిగాయని చెప్పారు. మా నాన్న మందు తాగకూడదు అని ఒక రోజు రాకూడదని తాను కోరుకుంటానని భావోద్వేగానికి గురయ్యాడు. గుడిసెలో ఉన్నప్పుడు కూడా ఐదుగురం కలిసి నవ్వుకుంటూ తినేవారమని, కానీ తండ్రి మద్యపానం వల్ల ముద్ద నోట్లోకి పోయేది కాదని చెప్పారు. సంక్రాంతికి అందరూ కొత్త బట్టలు వేసుకుని ఆడుకుంటుంటే తాము మాత్రం సిమెంట్ పనులకు వెళ్లేవాళ్లమని, జ్వరం వస్తే అమ్మ ఆపిల్స్ కొంటుందని జ్వరం రావాలని కోరుకునేవారమని నూకరాజు బాల్యంలోని కష్టాలను గుర్తుచేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

తండ్రి చాలా ఫన్నీ వ్యక్తి అని, ఆయనకు అమ్మతో మాట్లాడమంటే రెండు నిమిషాల్లో చిరాకు వచ్చేస్తుందని, కానీ వీధిలోకి వెళ్లి ఎవరైనా కనిపిస్తే పది నిమిషాలైనా ఓపిగ్గా మాట్లాడతారని నూకరాజు వివరించారు. ఎప్పుడైనా వెన్నుపోటు పొడిపించుకున్నావా అని అడగ్గా, నూకరాజు నవ్వుతో సమాధానం ఇచ్చారు. తన వెనక తిరిగే ఒక ఆర్టిస్ట్ చెల్లికి ఒంట్లో బాలేదంటే, పేపర్ మీద రాపించుకోకుండా 13 లక్షలు ఇచ్చానని కానీ అతడు మోసం చేశాడని అన్నారు. ఆ సహాయం తన బాల్య కష్టాల నుండే వచ్చిందని నూకరాజు తెలిపారు. తన చిన్నప్పుడు పావు కిలో చికెన్ తినాలంటే రెండు వారాలు ఎదురుచూసేవారమని, 4000 రూపాయల పడవ కోసం కూడా అప్పు చేయని రోజులు లేవని చెప్పారు. ఇలాంటి కష్టాలను అనుభవించిన తాను ఇతరుల బాధను అర్థం చేసుకోగలనని నూకరాజు స్పష్టం చేశారు.

ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

ఎక్కువమంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *