
హాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే సెలబ్రిటీ ప్రీమియర్ హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఒకప్పుడు ముంబైకే పరిమితమైన ఇలాంటి ప్రతిష్టాత్మక హాలీవుడ్ ఈవెంట్లు ఇప్పుడు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నాయి. ఈ పరిణామం మన భాగ్యనగరం మూవీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారుతుందనడానికి స్పష్టమైన నిదర్శనం.స్పైడర్ మ్యాన్ ప్రీమియర్‌కు హైదరాబాద్ వేదిక కావడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం ప్రకారం, ఒకప్పుడు కేవలం బాలీవుడ్ హబ్‌గా ఉన్న ముంబై నుంచి హాలీవుడ్ ప్రీమియర్లు హైదరాబాద్‌కు షిఫ్ట్ అవ్వడం మన నగరం యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను సూచిస్తోంది.ప్రస్తుతం, అల్లు సినిమాస్ వంటి ఐకానిక్ మల్టీప్లెక్స్‌లు, వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో ప్రేక్షకులకు అల్టిమేట్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తున్నాయి. 4కే లేజర్ ప్రొజెక్షన్, అత్యాధునిక డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ వంటి అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్‌తో హాలీవుడ్ మేకర్స్ సైతం హైదరాబాద్‌లోని థియేటర్ల వైపు ఆసక్తిగా చూస్తున్నారు.