Headlines

మీ ఫ్యామిలీకి బీమా పాలసీ తీసుకుంటున్నారా.. ఒక్క నిమిషం.. ఈ విషయాలు తెలుసుకోండి!


కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించాలనే ఉద్దేశంతో చాలామంది కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుంటారు. అయితే, నేడు పెద్ద మొత్తంగా కనిపించే ఈ కోటి రూపాయలు రాబోయే 15 లేదా 20 ఏళ్ల తర్వాత కుటుంబానికి సరిపోకపోవచ్చు. పెరుగుతున్న ధరలు, విద్యా, వైద్య ఖర్చుల దృష్ట్యా ఈ మొత్తం అందరికీ సరిపోతుందని చెప్పలేం. అప్పులు లేని వారికి లేదా తక్కువ బాధ్యతలు ఉన్న వారికి ఇది సరిపోవచ్చు. కానీ, హోమ్ లోన్, పిల్లల చదువులు, తల్లిదండ్రుల బాధ్యతలు ఉన్నవారికి మాత్రం ఖచ్చితంగా ఎక్కువ కవరేజ్ అవసరం. సాధారణంగా, వార్షిక ఆదాయానికి 10 నుంచి 15 రెట్లు భీమా ఉండాలని నిపుణులు సూచిస్తారు. టర్మ్ పాలసీ తీసుకునే ముందు ఐదు ముఖ్యమైన అంశాలను తప్పకుండా పరిశీలించాలి. మీరు సంపాదించే ఆదాయంపై కుటుంబం ఆధారపడి ఉంటే, మీ తదనంతరం ఎంత మొత్తం అవసరమో అంచనా వేయాలి. అలాగే, హోమ్ లోన్ వంటి అప్పుల భారం కుటుంబంపై పడకుండా వాటిని కూడా భీమా లెక్కల్లో కలపాలి. నెలవారీ కుటుంబ ఖర్చులు, పిల్లల ఉన్నత విద్యా లక్ష్యాలకు కావలసిన భారీ ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. చివరగా, మీ వద్ద ఇప్పటికే ఉన్న పాత భీమా పాలసీలు, పొదుపు, పెట్టుబడులను బేరీజు వేసుకొని, అదనంగా ఎంత భీమా అవసరమో తేల్చుకోవాలి. కేవలం నేటి ఖర్చుల ఆధారంగా కాకుండా, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని, కుటుంబ వాస్తవ అవసరాలను లెక్కించి సరైన కవరేజ్ తీసుకోవడమే నిజమైన ఆర్థిక భద్రత.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బస్టాండ్‌లో కనువిందు చేస్తున్న అరుదైన దృశ్యం

ఏపీలో భారీ జాబ్ స్కామ్! ఒక్క వీడియోతో బుక్కైన నిందితులు! నిందితుల వాట్సప్ చాట్‌ వైరల్

ఓటర్లకు గొప్ప శుభవార్త.. ఆ రూల్ ఎత్తేసిన ఎన్నికల సంఘం.. ఇలా చేస్తే మీ ఓటు సేఫ్

రూ.928 ఇచ్చి.. రూ.8.23 లక్షలు కొట్టేశారు

అర్ధరాత్రి ఇంట్లో చొరబడిన అనుకోని అతిథి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *