ధనస్సులో సూర్యుడు మేష రాశి వారికి 9వ స్థానంలో సంచరిస్తాడు. దీనిని భాగ్య స్థానం అంటారు. అదృష్టం కలిసి వస్తుంది. ఆగిపోయిన పనులు మళ్ళీ ముందుకు కదులుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. విదేశీ ప్రయాణానికి అవకాశం, పితృ ఆస్తి విషయంలో శుభవార్త. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం.