పండుగలు, పూతయారీలోకి వెళ్లితే.. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి, అందులో ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వను వేయాలి. నెయ్యి ఏమీ వేయకుండానే, మంటను తక్కువ మంటలో పెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు దోరగా వేయించాలి. రవ్వ మంచి సువాసన వచ్చేంత వరకు, రంగు మారేంత వరకు వేయించి, ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ రవ్వ ఎరుపు రంగులో ఉంటుంది, సాధారణంగా దొరికే పసుపు రంగు రవ్వ కంటే భిన్నంగా ఉంటుంది. తర్వాత అదే పాన్‌లో రెండు టేబుల్స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్‌ను వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించి, ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.జల సమయంలో దేవుడికి నైవేద్యంగా సమర్పించడానికి అత్యంత ప్రీతిపాత్రమైన వంటకాలలో గోధుమ రవ్వ ప్రసాదం ఒకటి. నోట్లో కరిగిపోయేలా, కమ్మనైన రుచితో ఈ ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. ఎర్ర గోధుమ రవ్వ: 1 కప్పు, నీళ్లు: 4 కప్పులు, తురుముకున్న బెల్లం: 1 కప్పు, పంచదార: 1/2 కప్పు, నెయ్యి: 4 టేబుల్‌స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ , యాలకుల పొడి: 1/2 టీస్పూన్, పచ్చ కర్పూరం: చిటికెడు, ఉప్పు: 1/4 టీస్పూన్.
తయారీలోకి వెళ్లితే.. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి, అందులో ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వను వేయాలి. నెయ్యి ఏమీ వేయకుండానే, మంటను తక్కువ మంటలో పెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు దోరగా వేయించాలి. రవ్వ మంచి సువాసన వచ్చేంత వరకు, రంగు మారేంత వరకు వేయించి, ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ రవ్వ ఎరుపు రంగులో ఉంటుంది, సాధారణంగా దొరికే పసుపు రంగు రవ్వ కంటే భిన్నంగా ఉంటుంది. తర్వాత అదే పాన్‌లో రెండు టేబుల్స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్‌ను వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించి, ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే పాన్‌లో రవ్వ తీసుకున్న కప్పుతో నాలుగు కప్పుల నీళ్లు పోయాలి. ఇందులోనే పావు టీస్పూన్ ఉప్పు కూడా చేర్చాలి. నీళ్లు బాగా పొంగి వచ్చేంత వరకు మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత, పక్కన పెట్టుకున్న వేయించిన గోధుమ రవ్వను నెమ్మదిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. మంటను లో నుండి మీడియం ఫ్లేమ్‌కు తగ్గించి, మూత పెట్టి 10-15 నిమిషాల పాటు రవ్వ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించాలి. రవ్వ పూర్తిగా మెత్తబడాలి.
రవ్వ మెత్తగా ఉడికిన తర్వాత, ఒక కప్పు తురుముకున్న బెల్లం, అర కప్పు పంచదారను వేయాలి. బెల్లం మరియు పంచదార రెండూ వాడటం వల్ల ప్రసాదానికి మంచి రుచి వస్తుంది. కేవలం బెల్లం లేదా కేవలం పంచదారతో కూడా చేసుకోవచ్చు. బెల్లం, పంచదార కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత, మూత పెట్టి ఐదు నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించాలి. ఆ తర్వాత అర టీస్పూన్ యాలకుల పొడి, ఒక చిటికెడు పచ్చ కర్పూరం వేసి కలపాలి. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ను కూడా వేసి రెండు నిమిషాలు ఉడికించాలి.
చివరిగా, స్టవ్ ఆఫ్ చేయడానికి ముందు రెండు టేబుల్స్పూన్ల నెయ్యి వేసి బాగా కలిపి దించేయాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే దించేస్తే, చల్లారిన తర్వాత ప్రసాదం గట్టిపడకుండా, నోట్లో వెన్నలా కరిగిపోయేలా ఉంటుంది. అంతే టేస్టీ టేస్టీ గోధుమ రవ్వ ప్రసాదం రెడీ.




