Headlines

Bigg Boss Telugu 10: ఏంటి.. ఈ బిగ్‌బాస్ తెలుగు 10 కంటెస్టెంట్ హీరోయిన్ రష్మిక కాలేజీ సీనియరా? అసలు ఊహించలేదుగా


స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రస్తుతం తన ‘మైసా’ సినిమా ప్రమోషన్లలో ఉంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా మైసా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు అతిథిగా హాజరైంది రష్మిక. ఈ సందర్భంగా హోస్ట్ నాగార్జునతో పాటు బిగ్ బాస్ 10 కంటెస్టెంట్లతోనూ ఎంతో సరదాగా మాట్లాడింది ముద్దుగుమ్మ. అయితే ఈ బిగ్ బాస్ 10 వేదికపై రష్మికకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఎదురైంది. ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ రియాలిటీ షో టాప్ కంటెస్టెంట్ ముఖేష్ గౌడ, తాను రష్మికకు కాలేజీ సీనియర్ అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆదివారం (నవంబర్ 22) ఎపిసోడ్‌లో భాగంగా నాగార్జున హౌస్‌లోని కంటెస్టెంట్లందరికీ రష్మికను పరిచయం చేశారు. ముఖేష్‌ను ఉద్దేశించి నాగార్జున, “రష్మిక ఇక్కడికి వచ్చింది. ఆమెతో మీకు నచ్చిన మైసూరు కన్నడలో గానీ, బెంగళూరు కన్నడలో గానీ మాట్లాడండి” అని చెప్పారు. దీనికి స్పందించిన ముఖేష్ రష్మికతో.. ‘నువ్వు కాలేజీలో నా జూనియర్‌వి’ అని అన్నాడు. ఇది విని రష్మిక ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. ఆమె ఫేస్ ఎక్స్‌ ప్రెషన్స్ గమనించిన ముఖేష్, ‘నా స్నేహితులు నీతో పాటు చదువుకునేవారు. నేను నిన్ను అక్కడ చూశాను’ అని గుర్తుచేసుకున్నాడు.

“మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది” అని చెబుతూ రష్మిక తన సంతోషాన్ని వ్యక్తం చేసి ముఖేష్ కు శుభాకాంక్షలు తెలిపింది. ముఖేష్ కూడా తనకు రష్మిక నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా నచ్చిందని చెప్పాడు. దానికి రష్మిక స్పందిస్తూ, “మీరు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక, ‘మైసా’ సినిమా చూడండి. నేను కూడా అందులో యాక్షన్ సన్నివేశాల్లో నటించాను” అని చెప్పింది.

ఇవి కూడా చదవండి



ముఖేష్ గౌడతో రష్మిక మందన్నా ..

ఇదిలా ఉంటే కర్ణాటకలోని కూర్గ్, మైసూరు, బెంగళూరు నగరాల్లో రష్మిక విద్యాభ్యాసం సాగింది. బెంగళూరు కాలేజీ రోజుల నాటి పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ ముఖేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను నిర్వహిస్తున్న టీమ్ ఓ ప్రత్యేక పోస్ట్ పెట్టింది. ‘ముఖేష్, రష్మిక గారు మైసూరు కన్నడలో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. అన్నింటికంటే పెద్ద సర్‌ప్రైజ్ ఏంటంటే రష్మిక గారు ముఖేష్‌కు కాలేజీ జూనియర్. కాలేజీ కనెక్షన్ నుంచి బిగ్ బాస్ వేదికపై కలుసుకోవడం వరకు ఇదొక అద్భుతమైన క్షణం’ అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *