ఆగస్టు నెలలో కుజుడు, శుక్రుడు, బుధుడు, రవి రాశులు మారడం జరుగుతోంది. ఇందులో కుజుడు 3వ తేదీన మిథున రాశిలోకి, శుక్రుడు 3వ తేదీన కన్యారాశిలోకి, బుధుడు 6వ తేదీన కర్కాటక రాశిలోకి, రవి 17 వ తేదీన తన స్వక్షేత్రమైన సింహ రాశిలోకి మారడం జరుగుతోంది. వీటి ప్రభావం ఇవి అధిపతులుగా ఉన్న రాశుల వారి జీవితాల మీద పడే అవకాశం ఉంటుంది. కుజుడి మార్పు వల్ల మేష, వృశ్చిక రాశులు, శుక్రుడి మార్పు వల్ల వృషభ, తులా రాశులు, బుధుడి మార్పు వల్ల మిథున, కన్యా రాశులు, రవి మార్పు వల్ల సింహ రాశి జీవితాలు కొత్త మలుపులు తిరుగుతాయి. వీటి ప్రభావం నెల రోజులకు పైగా ఉంటుంది.