Headlines

బండి భగీరథ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

బండి భగీరథ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్


బండి భగీరథ్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్ పైన నమోదు అయిన కేసుపై తక్షణమే విచారణ మొదలు పెట్టాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌కు ఆదేశాలు జారీ చేశారు. 8 వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని డీజీపీ సీఎంకు వివరించారు. దీంతో కేసు స‌మ‌గ్ర విచారణ కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డీజీపీని ఆదేశించారు.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *