Headlines

ఫ్రాడ్ ఆరోపణలు.. “కాగ్నిజెంట్‌”కు అమెరికాలో షాక్!


వీసా మోసాల ఆరోపణలపై విచారణ కొనసాగుతుండటంతో, కొత్తగా గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌  కోసం దరఖాస్తు చేసుకోకుండా అమెరికా కార్మిక శాఖ కాగ్నిజెంట్ పై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ విషయాన్ని డిపార్ట్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో అధికారికంగా వెల్లడించారు. కాగ్నిజెంట్‌తో పాటు ‘క్లౌడెరా’ అనే మరో టెక్ కంపెనీపై కూడా ఇలాంటి చర్యలే తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో కాగ్నిజెంట్ కొత్తగా ‘పీఈఆర్ఎం’ (PERM) దరఖాస్తులు చేయడానికి వీలుపడదు. విదేశీ ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ ఇప్పించాలంటే కంపెనీలు కచ్చితంగా కార్మిక శాఖ నుంచి  లేబర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇప్పుడు సరిగ్గా ఈ ప్రక్రియ మీదే నిషేధం పడింది.

టెక్ నిపుణుల్లో టెన్షన్

ఈ పరిణామంతో కాగ్నిజెంట్‌లో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ టెక్ నిపుణుల్లో టెన్షన్ మొదలైంది. 1994 లో చెన్నైలో పుట్టి అమెరికాలోని న్యూజెర్సీలో హెడ్‌క్వార్టర్స్ ఉన్న కంపెనీ, హెచ్‌-1బీ వీసాలను భారీగా వాడే కంపెనీల టాప్ లిస్ట్‌లో ఉంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీకి 3,510 కి పైగా హెచ్‌-1బీ వీసాలు అప్రూవ్ అయ్యాయి. అమెజాన్, టీసీఎస్, ఇన్ఫోసిస్, యాపిల్, మైక్రోసాఫ్ట్ తర్వాతి స్థానంలో కాగ్నిజెంట్ ఉంది. ప్రెజంట్ ఈ సస్పెన్షన్ డైరెక్ట్‌గా హెచ్‌-1బీలను ఎఫెక్ట్ చేయకపోయినా, డిపార్ట్‌మెంట్ ఎంక్వైరీ నడుస్తుండటంతో ఉద్యోగుల్లో మాత్రం ఊపిరాడనంత టెన్షన్ నడుస్తోంది.

వీసా నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలతో కాగ్నిజెంట్ పై  సస్పెన్షన్ వేటు పడింది. “అమెరికన్ వర్కర్స్‌కి ప్రాబ్లమ్ వస్తే అస్సలు ఊరుకోం” అంటూ డి’ ఎస్పోసిటో చాలా స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చారు. కొద్ది నెలల క్రితమే ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కాగ్నిజెంట్‌పై చర్యలు ఉంటాయని “జస్ట్ వెయిట్ అండ్ వాచ్” అంటూ  పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. విజిల్ బ్లోయర్ల నుంచి  వచ్చిన ఫిర్యాదులపై స్పందించి ఆ ఆరోపణలపై విచారణ జరుపుతున్నామని ఆయన గతంలో ‘ఫాక్స్ బిజినెస్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

వీసాలపై అమెరికా ఉక్కుపాదం

అమెరికాలో వీసా ఫ్రాడ్స్‌పై ప్రభుత్వం సీరియస్ అవుతోంది. అందులో భాగంగానే కాగ్నిజెంట్‌కు గట్టిగా తగిలింది. అసలు గ్రీన్ కార్డ్ ప్రాసెస్‌కి ఫస్ట్ స్టెప్ అయిన ‘PERM’ ఫైలింగ్స్‌ మీదే యూఎస్ డిపార్ట్‌మెంట్ కంప్లీట్ బ్యాన్ వేసింది. స్థానిక అమెరికన్ వర్కర్స్ దొరకలేదనీ, విదేశాల నుంచి తెచ్చుకునే టెకీ ల వల్ల అక్కడి స్థానికుల జీతభత్యాలకు కానీ లేదా జాబ్ కండీషన్స్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ రాదని కంపెనీ ఫస్ట్ ప్రూవ్ చేసుకోవాలి. లేబర్ డిపార్ట్‌మెంట్ చెప్పిన మినిమం శాలరీ ఇస్తామని ఒప్పుకోవాలి. ఇవన్నీ క్రాస్ అయ్యాకే గ్రీన్ కార్డ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అసలు ఈ ఫస్ట్ బేసిక్ స్టెప్ మీదే సస్పెన్షన్ పడటంతో, కాగ్నిజెంట్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆగిపోయింది. టెకీల గ్రీన్ కార్డ్ డ్రీమ్స్‌కి ఇదొక బిగ్ స్పీడ్ బ్రేకర్!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *