Headlines

ఐఆర్‌సీటీసీ మనీలాండరింగ్ కేసు కీలక మలుపు.. లాలూ కుటుంబానికి కోర్టులో బిగ్ షాక్..!


ఐఆర్‌సీటీసీ హోటల్ టెండర్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గురువారం (సెప్టెంబర్ 10, 2026) ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్, భార్య రబ్రీ దేవితో పాటు మొత్తం తొమ్మిది మంది నిందితులపై అభియోగాలు నమోదు చేసింది.

ఈ కేసులో సరళా గుప్తా, లారా ప్రాజెక్ట్స్, సుజాత హోటల్స్ తదితరులు కూడా నిందితులుగా ఉన్నారు. ఐఆర్‌సీటీసీకి చెందిన హోటళ్ల టెండర్లలో అవకతవకలు, వాటి ద్వారా అక్రమంగా లబ్ధి పొందినట్లు వచ్చిన ఆరోపణల ఆధారంగా మనీలాండరింగ్ కేసు నమోదైంది. విచారణ సందర్భంగా లారా ప్రాజెక్ట్స్ సంస్థ పొందిన ప్రయోజనాలు, ఈ వ్యవహారంలో లాలూ ప్రసాద్ యాదవ్ పాత్రపై అనుమానాలకు దారితీస్తోందని కోర్టు పేర్కొన్నట్లు సమాచారం. అలాగే లాలూపై జరిగిన దర్యాప్తు రాజకీయ ప్రేరేపితమైనదిగా కనిపించడం లేదని కోర్టు అభిప్రాయపడింది.

అయితే ఈ కేసులో మరో ఏడుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. తాజా పరిణామంతో ఈ కేసు మరోసారి రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *