Headlines

నేను పెద్ద స్టార్ అనే భావం ఆయనలో ఏమాత్రం ఉండదు.. చాలా మంచి వ్యక్తి


తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి ఇంద్రజ తన కెరీర్, అనుభవాలు, ప్రముఖులతో తన అనుబంధం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గురించి, తన కెరీర్‌లో ఎదురైన మలుపులు, అలాగే దివంగత నటి సౌందర్యతో తనకున్న అనుబంధాన్ని ఆమె పంచుకున్నారు. ఒక నిర్దిష్ట పాత్రకు సంబంధించిన క్రెడిట్ పూర్తిగా దర్శకుడు గుణశేఖర్‌కు దక్కుతుందని ఇంద్రజ అన్నారు. ఆ పాత్ర చాలా ఎలక్ట్రిఫైయింగ్, ఎమోషనల్, హై డ్రామాతో కూడుకున్నదని ఆమె అభివర్ణించారు. అయితే, ఆ పాత్రకు నంది అవార్డు లభించాల్సి ఉండగా, డబ్బింగ్ వాయిస్ తనది కాకపోవడం వల్ల చివరి నిమిషంలో కోల్పోయానని ఇంద్రజ చెప్పారు. ఆ సంవత్సరం నుంచే సొంత డబ్బింగ్ ఉంటేనే అవార్డు ఇస్తారనే నియమం వచ్చిందని, ఇది తనను ఎంతో బాధించిందని ఆమె వెల్లడించారు. అవార్డు కన్నా కూడా తమ పనికి లభించే గుర్తింపు ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు.

బాలకృష్ణతో పనిచేసిన అనుభవం గురించి ఇంద్రజ ప్రస్తావిస్తూ, ఆయన అత్యంత పవర్ ఫుల్, జోవియల్, చాలా స్నేహపూర్వక వ్యక్తి అని అన్నారు. ఆయనతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని, తాను సో అండ్ సో పెద్ద స్టార్‌ను అన్న భావం ఆయనలో ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు. “లయన్” చిత్రంలో మళ్లీ బాలకృష్ణతో కలిసి నటించినప్పుడు కూడా ఆయన అంతే ఆప్యాయంగా, స్నేహపూర్వకంగా పలకరించారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొనే సవాళ్ల గురించి మాట్లాడుతూ, “ప్రపోజల్స్” అనేవి కేవలం సినీ రంగంలోనే కాకుండా, ఏ రంగంలోనైనా అందమైన మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్యలేనని ఇంద్రజ అభిప్రాయపడ్డారు.

ఇది కేవలం తాను కొత్తగా వచ్చినందునో, లేక తాను మహిళ అయినందునో జరుగుతుందని తాను చెప్పలేనని ఆమె అన్నారు. 1997-99 మధ్య కాలంలో తెలుగులో తన సినిమాలు ఫ్లాప్ అవ్వడం గురించి ఆమె ప్రస్తావించారు. 2000వ సంవత్సరం నాటికి తాను మలయాళ చిత్ర పరిశ్రమలోకి వెళ్లిపోయానని తెలిపారు. సొగసు చూడతరమా చిత్రాన్ని పనామా ఫిల్మ్ ఫెస్టివల్‌లో చూసి మలయాళ అగ్ర దర్శకుడు సిబి మలయిల్ తనకు ఆఫర్ ఇచ్చారని, అది తన కెరీర్‌కు ఒక మలుపు అని ఆమె చెప్పారు. అప్పటి నుంచి మమ్ముట్టి, మోహన్‌లాల్, సురేష్ గోపి వంటి అగ్రతారలతో కలిసి వరుస చిత్రాలు చేశానని, ఇది అనుకోకుండా జరిగిందని ఇంద్రజ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *