మీరు చూస్తున్న ఈ ఫోటో చాలా సాధారణంగా కనిపించవచ్చు. కానీ దాన్ని నిశితంగా పరిశీలిస్తే మన కళ్లకు, మెదడుకు అసలైన పరీక్ష మొదలవుతుంది. అలాంటి ఓ గమ్మత్తైన ఆప్టికల్ ఇల్యూషన్ (Optical Illusion) ఇప్పుడు మీ ముందుంది. ఈ ఫొటోలో అరటి కాయలు, ఆకులు తప్ప మరేమీ లేనట్టు కనిపిస్తోంది కదా? కానీ ఆ గుత్తి మధ్యలో ఒక పాము నక్కి ఉంది. చుట్టూ ఉన్న రంగుల్లో తనను తాను కలిపేసుకుని, ఎవరి కంటా పడకుండా చాకచక్యంగా దాక్కుంది. మరి మీ కళ్లు ఎంత షార్పో చెక్ చేసుకుందామా?
మన మెదడు ఎందుకు మోసపోతుంది?
ఇలాంటి బ్రెయిన్ టీజర్లు, పజిల్స్ పరిష్కరించడం వల్ల మన ఆలోచనా శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను కొత్త కోణంలో చూసే అలవాటు కూడా ఏర్పడుతుంది. మన కళ్లు చూసే ప్రతి విషయాన్ని మెదడు తనకు అనుగుణంగా ఫిల్టర్ చేసుకుంటుంది. అనవసరమైన సమాచారాన్ని పక్కనపెట్టి, తెలిసిన ఆకారాలను త్వరగా గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. అరటి కాయల వంపులు, ఆకుల ఛాయలు ఒకేలా ఉండటంతో పాము కంటి ముందున్నా కూడా మన మెదడు దాన్ని సులభంగా గుర్తించలేకపోతుంది. రోజూ ఇలాంటి ఇల్యూషన్స్‌తో కాసేపు ఆడుకుంటే పరిశీలనా శక్తి మరింత పదునెక్కుతుంది.
మీ కౌంట్‌డౌన్ స్టార్ట్..
ఇక ఆలస్యం ఎందుకు.. మీ సమయం ఇప్పుడే మొదలైంది!15.. 14.. 13.. 12.. 11.. కళ్లకు కాస్త పని చెప్పండి. ఫొటోను పై నుంచి కిందికి, ఎడమ నుంచి కుడికి నిశితంగా పరిశీలించండి. ప్రతి నీడను, ప్రతి మలుపును జాగ్రత్తగా చూడండి. పాము ఎక్కడ దాక్కుందో కనిపెట్టారా?10.. 9.. 8.. 7.. 6.. ఇప్పుడు మీ మెదడు వేగంగా ఆలోచించడం మొదలుపెడుతుంది. సాధారణ ఆకారాల మధ్య ఉన్న భిన్నమైన ఆకారాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. అరటి గెలలు, ఆకుల మధ్య ఆ పాము చాలా తెలివిగా తలదాచుకుంది.5.. 4.. 3.. 2.. 1.. టైమ్స్ అప్!
పాము ఎక్కడ ఉందో దొరికిందా?
ఒక్కసారి ఆగి, ఫొటోలోని అరతీకాయల మధ్య ఉన్న ఆకారాన్ని మళ్లీ చూడండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ పాము తల స్పష్టంగా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న రంగులతో కలిసిపోవడంతో మొదటి చూపులో అది మిస్సవుతుంది. గడువులోపు పామును కనిపెట్టేశారా? అయితే మీరు నిజంగా ‘విజువల్ ఛాంపియన్’ అనిపించుకుంటారు. ఒకవేళ కనిపెట్టలేకపోయినా పర్వాలేదు.. మరోసారి ట్రై చేయండి.